శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (16:28 IST)

మహేష్ బాబు-మురుగదాస్ సినిమాలో స్పెషల్ జల్లికట్టు సీన్స్.. రోబోటిక్ సాలీడు కూడా?

టాలీవుడ్ ప్రిన్స్- మురుగదాస్ కాంబోలో వస్తున్న సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తిన

టాలీవుడ్ ప్రిన్స్- మురుగదాస్ కాంబోలో వస్తున్న సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తిని మురుగదాస్ తన సినిమాలో ఉపయోగించుకోనున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.  
 
ఇందుకు సంబంధించి ఇప్పటికే తన సినిమా స్క్రిప్ట్‌లో మురుగదాస్ మార్పులు చేశాడనే ప్రచారం సాగుతోంది. తమిళంలో మహేశ్ ఎంట్రీ మూవీకి ఇది ప్లస్ పాయింట్ అవుతుందనే ఉద్దేశంతోనే జల్లికట్టు సీన్లను ఈ సినిమాలో పొందుపరిచినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా ఈ సినిమాలో ఓ రోబోటిక్ సాలీడును కూడా వాడుతున్నారని తెలిసింది. 
 
ఈ సాలీడును కూడా టీజర్‌లో చూపించాలనుకుంటున్నాడట మురుగదాస్. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ పనులు పూర్తి చేసుకుని ఈ ఏడాదిలోపు సినిమాను రిలీజ్ చేయాలని సినీ యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రంలో మురుగదాస్ స్పెషల్ జల్లికట్లు సీన్లను కూడా షూట్ చేశాడని కోడంబాక్కం వర్గాల సమాచారం.