1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (19:46 IST)

'సుట్టంలా సూసి'కి ఏడు మిలియన్ ప్లస్ వ్యూస్‌ - విశ్వక్సేన్ లుక్ అదుర్స్

Gangs of Godavari
Gangs of Godavari
విశ్వక్సేన్ హీరోగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా తెరకెక్కుతోంది. సితార నాగవంశీ - సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి, కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. గోదావరి జిల్లాల నేపథ్యంలో ఈ సినిమా కథ తెరకెక్కుతోంది. 
 
కథానాయికగా నేహా శెట్టి ఇందులో అందాలను ఆరబోస్తోంది. ఇందులో విశ్వక్సేన్ లుక్ అదిరింది. తాజాగా ఈ సినిమా నుంచి 'సుట్టంలా సూసి' అంటూ విడుదలైంది. ఈ పాటను హీరోహీరోయిన్లపై చిత్రీకరించారు. ఈ పాట 7 మిలియన్ ప్లస్ వ్యూస్‌ను రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
 
ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చగా, శ్రీహర్ష ఈమని సాహిత్యాన్ని అందించారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.