శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 మార్చి 2018 (10:59 IST)

"సైరా" యూనిట్‌కు షాక్... చిరంజీవి - నయనతార - అమితాబ్ ఫోటోలు లీక్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ చిత్రంలోని కొన్ని ఫోటోలు ఇపుడు లీక్ అయ్యాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ చిత్రంలోని కొన్ని ఫోటోలు ఇపుడు లీక్ అయ్యాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
ఈ నేపథ్యంలో అదే స్టిల్‌కు సంబంధించిన ఒరిజినల్ ఫోటోతో పాటు, మరో రెడు ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులతో పంచుకున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా చిత్రం లీక్ కావడంతో, లీక్ వార్తలకు అడ్డుకట్ట వేసేందుకే చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
 
తన భార్య పాత్రధారి నయనతారతో కలసి యాగం పూర్తి చేసిన తర్వాత ఆశీర్వదిస్తున్న పండితుల ఫోటోను చిరంజీవి విడుదల చేశారు. ఇందులో అమితాబ్ కూడా కనిపిస్తున్నారు. తొలుత లీక్ అయిన ఫోటో ఒరిజినల్‌ను, అమితాబ్ గెటప్‌ను రివీల్ చేశారు. వాటిని మీరూ చూడవచ్చు.