Jyothika: పవర్, న్యాయం మధ్య పోరాటాన్ని తెలిపే సిస్టమ్ ట్రైలర్ విడుదల
Updated: Tue, 12 May 2026 (17:20 IST)
సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవరికేర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సిస్టమ్. ప్రైమ్ ఒరిజినల్ సినిమా SYSTEM ట్రైలర్‌ను విడుదల చేసింది. కోర్ట్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవర్, న్యాయం మధ్య జరిగే పోరాటాన్ని ఆసక్తికరంగా చూపించారు. ఈ చిత్రానికి అశ్విని అయ్యర్ తివారి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 22 నుంచి ప్రైమ్ వీడియో లో మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది.
ట్రైలర్‌లో నేహా అనే యువ లాయర్ పాత్రలో సోనాక్షి సిన్హా కనిపించారు. తన తండ్రిలా ఫర్మ్‌లో పార్ట్నర్ కావాలని ఆశపడే ఆమె, తన ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కోర్ట్ స్టెనోగ్రాఫర్ సారిక పాత్రలో నటించిన జ్యోతికతో కలిసి పని చేస్తుంది. అయితే సారికకు కొన్ని గోప్యమైన ఉద్దేశాలు కూడా ఉంటాయి. కోర్ట్ సన్నివేశాలు, భావోద్వేగాలు, ఆలోచింపజేసే డైలాగులతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
“పవర్ ముందు నిజం నిలబడగలదా? న్యాయం గెలుస్తుందా?” అనే ప్రశ్నను సినిమా ప్రధానంగా చూపించబోతోంది. దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారి మాట్లాడుతూ, నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథతో ఈ సినిమా రూపొందిందని తెలిపారు. అలాగే సోనాక్షి సిన్హా, జ్యోతిక ఈ చిత్రం తమ నటనకు కొత్త సవాల్‌గా నిలిచిందని చెప్పారు. ప్రేక్షకులను ఆలోచింపజేసే కథలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో ప్రైమ్ వీడియో మంచి వేదిక అని ఆమె అభిప్రాయపడ్డారు.
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
మరింత చదవండి