మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (10:52 IST)

అమ్మ బాబోయ్ బిగ్‌బాస్‌లో నరకం అనుభవించా: తాప్సీ

హీరోయిన్ తాప్సీ తాజా సినిమా ఆనందో బ్రహ్మ. ఈ సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్‌లోకి కాలు పెట్టిన తాప్సీ.. అక్కడ పార్టిసిపెంట్స్ పడుతున్న పాట్లను కళ్ళకు కట్టినట్లు తెలిపింది. తాను బిగ్ బాస్ హౌస్‌లో రె

హీరోయిన్ తాప్సీ తాజా సినిమా ఆనందో బ్రహ్మ. ఈ సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్‌లోకి కాలు పెట్టిన తాప్సీ.. అక్కడ పార్టిసిపెంట్స్ పడుతున్న పాట్లను కళ్ళకు కట్టినట్లు తెలిపింది. తాను బిగ్ బాస్ హౌస్‌లో రెండున్నర గంటల సేపు ఉన్నానని.. అప్పటికే తనకు చుక్కలు కనిపించాయని.. నరకం అనుభవించానని తాప్సీ చెప్పుకొచ్చింది.

కెమెరాల ముందు 24 గంటల పాటు కూర్చుని.. వారు చేసే చిన్న పనిని గమనించడం చూసి షాక్ అయ్యానని.. అలాంటి పరిస్థితి తనకు నరకాన్ని కళ్లకు చూపించిందని తాప్సీ తెలిపింది. 
 
ముమైత్, నవదీప్ తాము నటులమనే ఇమేజ్‌ను పక్కన బెట్టి బిగ్ బాస్ హౌస్ సాధారణంగా.. కెమెరాల కళ్లల్లో పడుతూ వుంటున్నారని..  బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ గ్రేట్ అంటూ తాప్సీ పేర్కొంది. రెండున్నర గంటల సేపు బిగ్ బాస్ హౌస్‌లో వుండి.. అమ్మ బాబోయ్ అని బయటికి వచ్చేశానని తాప్సీ వెల్లడించింది.