శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (13:51 IST)

త‌మ‌న్నా, మహేష్‌ బాబు కలిసి...

Mahesh, tamanna
మ‌హేష్ బాబు, త‌మ‌న్నా ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ కోసం క‌లిశారు. ఫ్రిజ్ ద‌గ్గ‌ర నిల‌బడ్డ వీరు ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్లు అక్క‌డ నిల‌బ‌డ్డారు. వీరిద్ద‌రిని క‌లిపింది అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. ఈరోజు షూటింగ్ చేస్తున్న స్టిల్స్‌ను సోష‌ల్‌మీడియాలో పెట్టారు. ఇప్ప‌టికే మ‌హేష్‌, త‌మ‌న్నా `స‌ర్కారువారి పాట‌`లో మెరిశారు. ఆ సినిమాలో పార్టీ సాంగ్‌లో న‌టించింది.

Mahesh, Vanga
ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌లో బిజీగా వుంది. ఇక మ‌హేష్‌బాబు స‌ర్కారువారి పాట చిత్రీక‌ర‌ణ‌లో వున్నాడు. ఇటీవ‌లే దుబాయ్ షెడ్యూల్ పూర్తిచేసుకుని తిరిగి వ‌చ్చారు. అనంత‌రం వంగా ఆఫ‌ర్ చేసిన యాడ్‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఇందులో వంగా వారిద్ద‌రి త‌గు సూచ‌న‌లు చేస్తూ క‌నిపించారు. మ‌హేస్‌బాబుకు, త‌మ‌న్నాకు ఇలా యాడ్స‌లో న‌టించ‌డం మామూలే. త‌మ‌న్నా ఆ మ‌ధ్య షారూఖ్‌తో క‌మ‌ర్షియ‌ల్‌యాడ్‌లో న‌టించింది.