శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (14:29 IST)

చిరంజీవిగారు.. చిరంజీవిగారే అని ప్రూవ్ అయిపోయింది.. మరి బాలకృష్ణ సంగతేంటి? : తమ్మారెడ్డి భరద్వాజ్

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150'పై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే, 'గౌతమిపుత్ర శాతకర్ణి' కలెక్షన్ల పరంగా బాలకృష్ణ కెరీర్‌లోనే పెద్ద హిట్ అని ఆయన అ

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150'పై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే, 'గౌతమిపుత్ర శాతకర్ణి' కలెక్షన్ల పరంగా బాలకృష్ణ కెరీర్‌లోనే పెద్ద హిట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఈ సంక్రాంతికి నాలుగు చిత్రాలు విడుదలైన సందడి చేసిన విషయం తెల్సిందే. వీటిలో చిరంజీవి 'ఖైదీ నంబర్ 150', బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి', శర్వానంద్ 'శతమానంభవతి', ఆర్.నారాయణమూర్తి 'హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య' చిత్రాలు ఉన్నాయి. ఇందులో ఖైదీ, శాతకర్ణి, శతమానం చిత్రాలపై భరద్వాజ్ తన మనసులోని మాటను వెల్లడించారు.
 
"పదేళ్ళ తర్వాత వచ్చిన చిరంజీవిని చూడటానికి ఫ్యాన్స్‌కు కన్నుల పండుగగా ఉంది. నా వరకూ నాకు ఆ సినిమాలో ఉదాత్తమైన సన్నివేశాలు బాగా నచ్చేశాయి. క్లైమాక్స్ వీక్‌గా ఉంది. 'కత్తి' చూసిన వారికి ఇది పెద్దగా ఎఫెక్టివ్ అనిపించలేదు. క్లోజింగ్ సీన్‌ల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. చిరంజీవి ఒక్కడి కోసమే జనం థియేటర్లకి ఎగబడటంతో థియేటర్లు నిండిపోతున్నాయి. ఈ రోజుకి కూడా నా ఆలోచనను నేను మార్చుకోవటం లేదు. నేను ఏమంటానంటే.. చిరంజీవిగారు చిరంజీవిగారే అనేది ప్రూవ్ అయిపోయింది.
 
ఇక.. "శాతకర్ణి గురించి" చెప్పాలంటే ఈ చిత్రం ట్రైలర్‌తోనే టీం నన్ను ఆకట్టుకుంది. సినిమా చూశాక సూపర్ అనిపించింది. బాలయ్య సినిమాల్లో ఇది పెద్ద హిట్. రెవెన్యూపరంగా ఆయన కెరీర్‌లోనే పెద్ద హిట్ అవుతుంది ఈ చిత్రం. తక్కువ టైంలో ఎక్కువ అవుట్‌పుట్ ఇవ్వడం ఎలాగో క్రిష్‌ని చూసి అందరం నేర్చుకోవాల్సిన టైం ఇది. శాతకర్ణిలో బాలకృష్ణ నటనకానీ.. క్రిష్ దర్శకత్వంకానీ.. సాయిమాధవ్ మాటలు కానీ.. కెమెరామన్ పనితనం కానీ చూస్తే.. తెలుగు సినిమాను టెక్నికల్‌గా మరో లెవెల్‌కు తీసుకెళ్లిన సినిమాగా చెప్పాలి." అన్నారు. 
 
చివరిగా శర్వానంద్‌పై మాట్లాడుతూ "శతమానంభవతి" ఇదో సరదా సినిమా. విదేశాల్లో ఉన్న తెలుగు వారే పండగలు మనకంటే బాగా చేసుకుంటున్నారు. మొత్తంమీద సినిమాలో మాత్రం మంచి విషయం ఉంది" అని చెప్పుకొచ్చారు.