లే లడక్‌లో పాటలు పూర్తి చేసుకున్న "ఇది నా లవ్ స్టోరీ"
తరుణ్, ఓవియా జంటగా రామ్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై రమేష్ గోపి దర్శకత్వంలో అభిరామ్ సమర్పణలో ఎస్.వి ప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం "ఇది నా లవ్ స్టొరీ". ఒక సాంగ్ మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
తరుణ్, ఓవియా జంటగా రామ్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై రమేష్ గోపి దర్శకత్వంలో అభిరామ్ సమర్పణలో ఎస్.వి ప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం "ఇది నా లవ్ స్టొరీ". ఒక సాంగ్ మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర విశేషాలను దర్శకుడు వెల్లడిస్తూ... "లే లడక్, కులుమనాలిలో చిత్రీకరించిన సాంగ్స్ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. మూడు పాత్రలలో తరుణ్ నటన అందరిని ఆకట్టుకుంటుంది. లవర్ బాయ్‌గా తరుణ్‌కి ఉన్న ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా పూర్తి స్థాయి లవ్‌స్టొరీని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా రూపొందించాం.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ శిష్యుడు శ్రీనాథ్ విజయ్‌ని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. నిర్మాత ఎస్.వి.ప్రకాష్ సహకారంతో ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని పూర్తి చేశా. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రం ఆడియోని వచ్చే నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు.