శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 29 జూన్ 2017 (21:51 IST)

నటుడు అజయ్ భార్య 2017 మిసెస్‌‌ ఇండియా వరల్డ్‌ ఫైనల్ రౌండ్‌కి... కిరీటం వచ్చేస్తుందిలే...

మిస్ ఇండియా పోటీల్లో నెగ్గడం చాలా సుళువే అంటారు చాలామంది. కానీ మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో నెగ్గాలంటే అంత ఈజీ కాదంటారు. దీనికీ ఓ కారణం వుంది. అదేంటయా అంటే... మిసెస్ ఇండియా అనగానే... పోటీలో పాల్గొనే మహిళకు వివాహమై వుంటుంది. వివాహమయ్యాక కూడా ఫిజ

మిస్ ఇండియా పోటీల్లో నెగ్గడం చాలా సుళువే అంటారు చాలామంది. కానీ మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో నెగ్గాలంటే అంత ఈజీ కాదంటారు. దీనికీ ఓ కారణం వుంది. అదేంటయా అంటే... మిసెస్ ఇండియా అనగానే... పోటీలో పాల్గొనే మహిళకు వివాహమై వుంటుంది. వివాహమయ్యాక కూడా ఫిజిక్కును పర్ఫెక్టుగా మెయిన్‌టైన్ చేయాలంటే చాలా శ్రమతో కూడిన పనే. 
 
ఐతే నటుడు అజయ్ భార్య శ్వేత రావూరి ‘హాట్‌ మోంద్‌’ నిర్వహించిన 2017 మిసెస్‌‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ పోటీల్లో ఫైనల్‌ రౌండ్‌కు ఎంపికై తన సత్తా ఏమిటో నిరూపించారు. తన భార్య ఫైనల్ రౌండుకు చేరడంపై నటుడు అజయ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆమె ఫేస్‌బుక్‌ పేజీని షేర్‌ చేశాడు. ఆమె ఇంతలా కష్టపడి ఆ స్థాయికి వెళ్లిన తర్వాత ఖచ్చితంగా మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ 2017 కిరీటాన్ని దక్కించుకుంటుందని అనుకోవచ్చు. డౌట్ లేదు... కిరీటం వచ్చేస్తుందిలే...