వాడు.. రైల్వే స్టేషన్‌లో దొరికాడు.. పాపం అని ఇంటికి తెచ్చుకున్నాం.. తనీష్

tanish
tanish
సెల్వి| Last Updated: సోమవారం, 31 ఆగస్టు 2020 (10:37 IST)
బిగ్ బాస్ రెండో సీజన్‌లో భాగంగా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కంటెస్టెంట్లలో తనీష్ ఒకడు. ఫైనల్ విజేతల్లో టాప్-3గా నిలబడి లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. దీప్తి సునయన, సామ్రాట్, తేజస్వీలతో ఎక్కువగా ఉన్న తనీష్ మధ్యలో అందరితో కలిసి ప్రయత్నం చేశాడు. ఇక కౌశల్‌తో గొడవలు మాత్రం యథావిథిగా జరిగేవి.. మళ్లీ కలుసుకునేవారు.

తాజాగా తనీష్ సోదరుడైన కృష్ణ అల్లాడి సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ప్రశ్నకు ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. తనీష్ అన్న గురించి ఓ సీక్రెట్ చెప్పండి అని సదరు ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు.. అసలు అతను నా అన్నయ్యే కాదు అంటూ కృష్ణ సమాధానం ఇచ్చాడు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా తనీష్ తన తమ్ముడి పోస్ట్‌పై గట్టిగానే కౌంటర్ వేశాడు. బ్రేకింగ్ న్యూస్ అంటూ చెబుతూ.. అవును మాకు వాడు రైల్వే స్టేషన్‌లో దొరికాడు.. పాపం అని ఇంటికి తెచ్చుకున్నాం అంటూ సరదాగా నవ్వేశాడు. మొత్తానికి అన్నాదమ్ముల్లిద్దరూ సెటైర్లు బాగానే వేస్తున్నారు.

తనీష్‌కు వాళ్ల అమ్మ అంటే ఎంత ఇష్టమో షోలో ఎన్నో సార్లు వివరించాడు. లావు తగ్గుతానని, కోపం తగ్గించుకుంటానని షోలోకి వచ్చేటప్పుడు మాటిచ్చాను అని అంటూ తనీష్ ఇంటి సభ్యులతో ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. ఇక తన తమ్ముల్లిద్దరి గురించి ఎంతో ప్రేమను కురిపించాడుదీనిపై మరింత చదవండి :