సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (09:44 IST)

హీరో శ్రీకాంత్‌కు పితృవియోగం...

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన హీరో శ్రీకాంత్‌కు తండ్రి మేక పరమేశ్వర రావు కన్నుమూశారు. ఆయనకు వయస్సు 70 యేళ్లు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన గత నాలుగు నెలలుగా నగరంలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆయన పరిస్థితి మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
 
పరమేశ్వరరావుది కృష్ణా జిల్లాలోని మేకావారిపాలెం కాగా, ఆ తర్వాత ఆయన కర్ణాటకలోని గంగావతి జిల్లా బసవపాలేనికి వలస వెళ్లారు.  పరమేశ్వరరావు-ఝాన్సీలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు శ్రీకాంత్, అనిల్ కాగా, ఓ అమ్మాయి నిర్మల ఉన్నారు.