బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 16 జనవరి 2019 (12:21 IST)

హాస్య బ్రహ్మకు గుండె ఆపరేషన్... ఆరోగ్యం ఎలా ఉంది?

టాలీవుడ్ 'హాస్య బ్రహ్మ' బ్రహ్మానందం ఆస్పత్రిలో చేరారు. 62 యేళ్ళ గుండె సంబంధిత ఆపరేషన్ చేశారట. ఈ ఆపరేషన్ ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్(ఏహెచ్ఐ)లో చేశారు. ఈ విషయాన్ని బ్రహ్మానందం కుటుంబ సభ్యులు వెల్లడించారు.
 
బ్రహ్మానందంకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఏహెచ్ఐలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచన చేయడంతో బ్రహ్మీ ఈ ఆపరేషన్ చేయించుకున్నారు. 
 
ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేకపోవడంతో ఏహెచ్‌ఐకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సర్జరీ చేయాలని సూచించారు. హార్ట్ సర్జన్ రమాకాంత్ పాండా సోమవారం బ్రహ్మానందంకు సర్జరీ చేశారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. 
 
ఆయన కొడుకులు రాజా గౌతమ్, సిద్దార్థ్ ఆసుపత్రిలో దగ్గరుండి చూసుకున్నారు. బ్రహ్మానందం త్వరగా కోలుకోవాలని పలువురు నెటిజన్లు ట్వీట్స్, కామెంట్స్ చేశారు. బ్రహ్మానందం మొత్తం 1000కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.