శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 23 ఆగస్టు 2018 (09:56 IST)

హాస్యబ్రహ్మ.. బ్రహ్మానందం కామెడీ ఇక ఇంట్లోనే చూడొచ్చు..

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం త్వరలో బుల్లితెరపై కనిపించనున్నారు. వెండితెరపై ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో.. బుల్లితెరపై కనిపించేందుకు సై అంటున్నారు. ప్రముఖ చానల్‌లో త్వరలో ప్రారంభం కానున్న ఓ కామెడీ షో

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం త్వరలో బుల్లితెరపై కనిపించనున్నారు. వెండితెరపై ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో.. బుల్లితెరపై కనిపించేందుకు సై అంటున్నారు. ప్రముఖ చానల్‌లో త్వరలో ప్రారంభం కానున్న ఓ కామెడీ షోకి బ్రహ్మీ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. 
 
ఇందుకు సంబంధించిన ప్రోమోను ఇటీవలే ఆ ఛానల్ విడుదల చేసింది. ఈ ప్రోమోలో బ్రహ్మానందం తనదైన శైలిలో పంచ్‌లు వేసి కామెడీ అదరగొట్టారు. ఈ ప్రోమోను చూసిన బ్రహ్మానందం ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. వెండితెరకు కొద్దికాలం దూరంగా వుంటున్న బ్రహ్మానందాన్ని ఇక బుల్లితెరపై చూసే అవకాశం వచ్చిందని పండగ చేసుకుంటున్నారు. 
 
కాగా, బ్రహ్మానందం ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్నారు. స్టార్ హీరో సినిమాల్లో తప్ప చిన్న సినిమాల్లో నటించడం లేదు. దీంతో ఆయన దృష్టి ఇప్పుడు బుల్లితెరపై పడింది. త్వరలోనే టీవీ తెరపై స్టాండప్ కామెడీని పండించనున్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం.150లో బ్రహ్మానందం నటించిన సంగతి తెలిసిందే.