శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 16 జులై 2018 (18:16 IST)

రష్మీ గౌతమ్‌కు 38 సంవత్సరాలా? అంతకుమించి..? (వీడియో)

రష్మీ గౌతమ్.. యాంకర్‌గా బుల్లితెరపై అదరగొట్టేస్తోంది. అలాగే వెండితెర అందాలను ఆరబోస్తుంది. నటిగా, యాంకర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే రష్మీపై ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. సాధారణంగా మహ

రష్మీ గౌతమ్.. యాంకర్‌గా బుల్లితెరపై అదరగొట్టేస్తోంది. అలాగే వెండితెర అందాలను ఆరబోస్తుంది. నటిగా, యాంకర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే రష్మీపై ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. సాధారణంగా మహిళా సెలెబ్రిటీలు వయస్సును బయటపెట్టరు. కానీ రష్మీ గౌతమ్ మాత్రం తన వయస్సేంటో చెప్పేసింది. ఓ బుల్లితెర కార్యక్రమానికి హాజరైన రష్మీ గౌతమ్.. తన వయస్సు 38 సంవత్సరాలని చెప్పింది. 
 
వాస్తవానికి రష్మీని చూస్తే అంత వయస్సున్నట్లు కనిపించదు. అంత వయసులోనూ హాట్‌గా కనిపిస్తూ, తన అందాలతో అభిమానుల మతిపోగొడుతోంది. ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటుంది. ఇటీవల ఓ నెటిజన్ పెళ్లి గురించి ప్రశ్నించగా.. అది తన వ్యక్తిగత విషయమని చెప్పింది. త్వరలోనే ఓ హారర్ కామెడీ మూవీతో రష్మీ వెండితెరపై  కనిపించబోతోంది. 
 
ఈ సినిమా ''అంతకుమించి'' అనే పేరిట తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను ఐదు కోట్ల మంది వీక్షించారు. ఈ ట్రైలర్లోనే జైతో రష్మీ రొమాన్స్ బాగా పండించింది. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.