సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 జులై 2018 (10:14 IST)

పాకిస్థాన్ జైళ్ళలో 471 మంది ఖైదీలు...

పాకిస్థాన్ జైళ్ళలో 47 మంది ఖైదీలు మగ్గుతున్నారు. వీరిలో 418 మంది మత్స్యుకారులు కాగా, 53 మంది ఇతరులు ఉన్నారు. ప్రతి యేడాది జూలై ఒకటో తేదీన ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి పాకిస్థాన్ సర్కారు

పాకిస్థాన్ జైళ్ళలో 47 మంది ఖైదీలు మగ్గుతున్నారు. వీరిలో 418 మంది మత్స్యుకారులు కాగా, 53 మంది ఇతరులు ఉన్నారు. ప్రతి యేడాది జూలై ఒకటో తేదీన ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి పాకిస్థాన్ సర్కారు ఓ జాబితాను సమర్పించడం ఆనవాయితీగా ఉంది.
 
ఈ జాబితా ప్రకారం పాకిస్థాన్‌లో 471 మంది ఖైదీలు పాక్ జైళ్ళలో మగ్గుతున్నట్టు తేలింది. అక్రమంగా భారతీయ జాలర్లు అక్రమంగా పాక్ సముద్ర జలాల్లోకి ప్రవేశించడంతో అరెస్టు చేశారు. 
 
మే 21, 2008లో భారత్-పాక్‌ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం… ప్రతి యేటా జనవరి-1, జూలై-1వ తేదీల్లో ఇరుదేశాల జైళ్లలో ఉన్న ఖైదీల సమాచారాన్ని రెండుదేశాలు పరస్పరం అందించుకుంటాయి. అందులోభాగంగానే ఈ రోజు పాక్ జైళ్లలో ఉన్న భారతీయ ఖైదీల వివరాల జాబితాను భారత్‌కు అందించినట్లు పాకిస్థాన్ విదేశీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.