గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 20 జూన్ 2023 (19:06 IST)

విజయ్ దళపతి 49వ పుట్టినరోజు: ఐఎండీబీలో టాప్ 8 అత్యధిక రేటింగ్స్ కలిగి ఉన్న విజయ్ సినిమాలు

image
నాలుగు దశాబ్దాల పాటు వివిధ జానర్లలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తమిళ చిత్ర పరిశ్రమలో స్థిరపడిన నటుడు జోసెఫ్ విజయ్. మెర్సల్, తుపాకి, కత్తి, గిల్లీ  అనేవి ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. కాదలుక్కు మరియదై చిత్రంలో చేసిన అద్బుతమైన నటనకుగాను విజయ్ ఉత్తమ నటుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న 'లియో' చిత్రం ద్వారా 2023 అక్టోబర్ 19న మరోసారి మనముందుకు రాబోతున్నాడు.
 
ఐఎండీబీలో విజయ్ టాప్ 8 అత్యధిక రేటింగ్స్ కలిగి ఉన్న సినిమాలు ఇవే:
1. లవ్ టుడే - 8.7
2. పూవే ఉనక్కగా - 8.6
3. ప్రియముదన్ - 8.5
4. తుల్లాద మనముం తుళ్ళం - 8.3
5. కాదలుక్కు మరియదై - 8.2
6. తుపాకీ - 8.1
7. కత్తి- 8.1
8. గిల్లి - 8.1