1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (12:45 IST)

దర్శకుడిగా పరిచయమవుతున్న స్టార్ హీరో తనయుడు.. ఎవరు?

vijay
కోలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన విజయ్ తనయుడు జాసన్ సంజయ్ విజయ్ త్వరలోనే వెండితెర సినీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. జాసన్ సంజయ్‌ను దర్శకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ హీరోగా పరిచయం చేయనుంది. ఈ మేరకు లైకా సంస్థ ఓ అధికారిక ప్రకటన చేసింది. 
 
ఇదే అంశంపై ఆ సంస్థ అధినేత సుభాస్కరన్ మాట్లాడుతూ, 'సరికొత్త ఆలోచనలతో ఉన్న యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ ఎప్పుడూ గేమ్ చేంజర్స్‌గా ఉంటారని లైకా ప్రొడక్షన్స్ బలంగా నమ్ముతుంటుంది. మా బ్యానర్‌లో తదుపరి ప్రాజెక్టును జాసన్ సంజయ్ విజయ్ డైరెక్ట్ చేయబోతున్నారనే విషయాన్ని తెలియజేయటానికి సంతోషంగా ఉంది. తను చెప్పిన యూనిక్ పాయింట్ నచ్చింది. 
 
సంజయ్ లండ‌న్‌‌లో స్క్రీన్ రైటింగ్‌లో బీఏ(ఆనర్స్)ను పూర్తి చేశారు. అలాగే టోరంటో ఫిల్మ్ స్కూల్‌లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమాను కంప్లీట్ చేశారు. తను మా టీమ్‌కి స్క్రిప్ట్ వివరించినప్పుడు మాకెంతో సంతృప్తికరంగా అనిపించింది. తను స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్‌లో స్పెషలైజేషన్ కోర్సులను చేయటం చాలా గొప్ప విషయం. తనకు సినిమా నిర్మాణంపై పూర్తి అవగాహన ఉంది. ప్రతీ ఫిల్మ్ మేకర్‌కి ఉండాల్సిన లక్షణం ఇది. జాసన్ సంజయ్ విజయ్‌తో కలిసి వర్క్ చేయటం ఓ మంచి అనుభూతి అవుతుందని భావిస్తున్నాం. ఇందులో ప్రముఖ నటీనటులు, సాంతికేతిక నిపుణులు పని చేయబోతున్నారు' అని తెలిపారు.
 
డైరెక్టర్ జాసన్ సంజయ్ విజయ్ మాట్లాడుతూ "లైకా ప్రొడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో నేను తొలి సినిమా చేయబోతుండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. కొత్త టాలెంట్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ ఎంకరేజ్ చేసే ఓ కేంద్రంగా ఈ నిర్మాణ సంస్థ ఉంది. ఈ సంస్థకు నా స్క్రిప్ట్ నచ్చటం నాకెంతో సంతోషాన్ని వారి రూపొందించే క్రమంలో పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు వారు తెలియజేశారని చెప్పారు.