సంబంధిత వార్తలు
- ఉలగనాయగన్ కమల్ హాసన్, హీరో శింబు కాంబినేషన్ STR48 ప్రకటన
- లాల్ సలాంలో వపర్‌ఫుల్ పాత్ర చేస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్
- 'పొన్నియిన్ సెల్వన్-2' మూవీ విడుదల ఎపుడంటే...
- నాన్నకు ప్రేమతో అంటే అర్థ కాలేదు, ప్రేమదేశం అనగానే గుడ్ అన్నారు : మధుబాల
- కమల్ హాసన్ బర్త్ డే, మణిరత్నం, ఏఆర్ రెహమాన్,కె హెచ్ 234 న్యూ మూవీ అనౌన్స్ మెంట్
మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ 2 నుంచి పాట విడుదల
Vikram, Trisha
ప్రియుడి ప్రేమలో చోళ రాజ్యపు యువరాణి మైమరచిపోతుంది. అతన్ని చూసినా, తలుచుకున్నా ముఖంలో చిరునవ్వు విచ్చుకుంటుందని ఆమె తన మనసులో ప్రేమను ఆగనందే ఆగనందే అంటూ అందమైన పాట రూపంలో పాడుకుంకుంటుంది. ఆ చోళ రాజ్యపు యువరాణి ఎవరో కాదు.. కుందవై , ఆమె ప్రియుడు వల్లవరాయుడు. కుందవిగా త్రిష, వల్లవరాయుడిగా కార్తి సిల్వర్ స్క్రీన్‌పై మెప్పించనున్నారు. అసలు వారి మధ్య ప్రేమకు కారణమేంటో తెలుసుకోవాలంటే పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా చూడాల్సిందేనంటున్నారు మణిరత్నం, సుభాస్కరన్.
సోమవారం ఈ సినిమా నుంచి ఆగనందే ఆగనందే అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ ఈ పాటను కంపోజ్ చేసి అందించారు. ఆనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను శక్తిశ్రీ గోపాలన్ శ్రావ్యంగా ఆలపించారు.
అత్యద్భుతమైన కోటలు, అంతకు మించిన కథ, కథనం, అందులో రాజతంత్రం, ఒకరికి ముగ్గురు హీరోలు, స్క్రీన్ నిండుగా హీరోయిన్లు అంటూ వేరే లెవల్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో తెరకెక్కుతోంది పొన్నియిన్ సెల్వన్2. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యారాయ్, త్రిష, జయరామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్‌గా ఈ పాన్ ఇండియా మూవీ తమిళ్ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది
