శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (18:22 IST)

పురోహితురాలి చేతుల మీదుగా దియా మీర్జా పెళ్లి.. ట్రెండ్ సెట్ చేసిందిగా..!

Dia Mirza
ప్రముఖ బాలీవుడ్‌ నటి దియా మీర్జా నయా ట్రెండ్‌ సెట్‌ చేశారు. దియా మీర్జా రెండో వివాహం పురోహితురాలి చేతుల మీదుగా జరిగింది. దియా మిర్జా పెళ్లి చేసింది.. పురోహితుడు కాదు.. పురోహితురాలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతుంది. 
 
దియా ఇది వరకే నిర్మాత సాహిల్‌ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2014లో వివాహం చేసుకోగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. 2019లో తమ అయిదేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. 
 
ఇక భర్తతో విడాకుల అనంతరం దియా, వ్యాపారవేత్త అయిన వైభవ్‌ రేఖీని ఈ నెల 15న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి వివాహ వేడుక ‘పురోహితురాలి’ చేతుల మీదుగా జరిగింది. ఇందుకు సంబందించిన ఫోటోని ట్విట్టర్‌లో షేర్‌ చేశారు దియా మీర్జా. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.