బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (18:17 IST)

మూడు పాత్రలని ఎందుకు చేయాలో దర్శకుడు చెప్పాక కన్విన్స్ అయ్యా : హీరో టోవినో థామస్

Tovino Thomas, Kriti Shetty, Aishwarya Rajesh, rohini and others
Tovino Thomas, Kriti Shetty, Aishwarya Rajesh, rohini and others
కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి హీరోయిన్స్ గా టోవినో థామస్ హీరోగా నటిస్తున్న చిత్రం  "ARM". జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా 'ARM'  ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
 
హీరో టోవినో థామస్ మాట్లాడుతూ, దర్శకుడు ఈ కథ చెప్పి మూడు క్యారెక్టర్స్ ప్లే చేయమని అడిగినప్పుడు.. మూడు క్యారెక్టర్స్ ని చేయగలనా ? అని అలోచించాను. మరో ఇద్దరు యాక్టర్స్ ని తీసుకోవచ్చు కదా అని అడిగాను. మూడు పాత్రలని నేనే ఎందుకు చేయాలో వారు చెప్పిన తర్వాత కన్విన్స్ అయ్యాను. ఆక్కడ నుంచి ఈ సినిమా ఒక డ్రీంలా జరిగింది. మరో మూడు రోజుల్లో ఆ డ్రీం నిజం కాబోతోంది. ఈ సినిమాపై మేమంతా చాలా నమ్మకంగా వున్నాం. రోహిణీ మేడం గారితో ఇది నా మూడో సినిమా. తను వండర్ ఫుల్ పెర్ఫార్మర్. హరీష్ తో పని చేయడం మూడోసారి. ఇందులో తన పాత్ర అందరినీ అలరిస్తుంది. ఐశ్వర్య క్యారెక్టర్ ఈ కథకి డ్రైవ్. తను అద్భుతంగా నటించింది. కృతి నాకంటే చాలా మెచ్యూర్ గా ఆలోచిస్తుంది. తను తెలుగులో సినిమా చేయమని చెప్పేది. సినిమా మీకు నచ్చుతుంది అన్నారు.  
 
హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ముంబై, చెన్నై,  కర్ణాటక కేరళలో ప్రమోట్ చేశాం. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రమోట్ చేయడం మళ్ళీ ఇంటికి వచ్చినట్లు వుంది. ఇది మంచి సినిమా. ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారనే నమ్మకం వుంది. చాలా అద్భుతమైన కథ ఇది. జితిన్ ఈ సినిమా కోసం ఎనిమిదేళ్ళుగా కష్టపడ్డారు. సురభి లక్ష్మి అవుట్ స్టాండింగ్ రోల్ చేశారు. రోహిణీ మేడం తో పని చేయడం మెమరబుల్ అన్నారు.  
 
ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ... ఇందులో జోది అనే క్యారెక్టర్ చేశాను. నా పాత్రని చాలా బ్యూటీఫుల్ గా డ్రాయింగ్ వేసి డైరెక్టర్ గారు నేరేట్ చేసినప్పుడు చాలా నచ్చింది. ఈ సినిమాలో భాగం కావడం హానర్ గా భావిస్తున్నాను అన్నారు. 
 
యాక్ట్రెస్ రోహిణి మాట్లాడుతూ, సినిమా విజువల్ ఫీస్ట్ గా వుంటుంది. త్రీడిలో చేయడమే ఈ సినిమాకి యాప్ట్. టోవినో థామస్ కెరీర్ లో ఈ సినిమా మైల్ స్టోన్ గా నిలిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా ని విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.