వేదాంత ధోరణిలో సూర్య
నటుడు సూర్య తమిళరంగంలో క్రియేటివ్ హీరో. ఆయన చేసిన సినిమాలు ఆయన సత్తా ఏమిటో చూపిస్తాయి. సింగం నుంచి జై భీమ్ వరకు ఆయన నటించిన సినిమాలు తెలుగు ప్రేక్షకుల్లో అభిమానులయ్యారు. రాక్షసుడు అనే సినిమాలో ఆత్మలు గురించి కాన్సెప్ట్‌లోనూ ఆయన భిన్నమైన కాన్సెప్ట్ ఎంచుకున్నారు. సెవెన్తసెన్స్‌లో మెడికల్ మాఫియాను సరికొత్త కోణంలో ఆవిష్కరించారు. తాజాగా `ఇ.టి.` ఎవరికి తలవంచడు అనే టైటిల్‌తో తెలుగులోనూ సినిమా మార్చి 10న విడుదల కాబోతుంది.
కాగా, ఈ సినిమా గురించి ఆయన చెబుతూ, సమాజంలో మహిళలపై జరిగే అరాచకాలు, అన్యాయాలను అరికట్టే వ్యక్తిగా నటించాను. ఇది సరికొత్త కాన్సప్ట్. పాండ్యరాజ్ కథను ఇప్పటి కాలానికి అనుగుణంగా మార్చాడని తెలియజేశారు. అయితే ప్రతి విషయానికి సూర్య వేదాంత ధోరణిలో మాట్లాడడం విశేషం. ఇటువంటివి వెంకటేష్ చెబుతుంటాడు. ఇప్పుడు తమిళంలో సూర్య చేరినట్లు తెలుస్తోంది. ఏది మన చేతుల్లో లేదు. అంతా ఏదో శక్తి మనల్ని నడుపుతుంది. మనం నిమిత్త మాత్రులమే అన్న విషయాన్ని చిత్ర ప్రమోషన్ సందర్భంగా నాలుగుసార్లు ఆయన ప్రస్తావించడం విశేషం.