సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

సూర్యాపేట - మేడ్చల్ జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు... నలుగురు దుర్మరణం

తెలంగాణా రాష్ట్రంలోని సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో జాతరకు వెళుతుండగా ఇద్దరు, మద్యంమత్తులో కారు నడిపి మరో ఇద్దరు అశువులు బాశారు. బుధవారం జరిగిన ఈ రెండు రోడ్డు ప్రమాద వార్తల వివరాలను పరిశీలిస్తే, 
 
సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం, తొగర్రాయి వద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, దవాఖానకు తరలించారు. వీరంతా మేళ్ళ చెరువు జాతరకు వెళుతుండగా అతి వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. 
 
అలాగే, మేడ్చల్ జిల్లా కొంపల్లి వద్ద కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఏడుగురు గాయప్డడారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు వెల్లడించారు.