ఇదే నా గ్లామర్ అంటోన్న సురేఖావాణి
నటి సురేఖావాణి తన అందచందాలను ఈమధ్య సోషల్ మీడియాలో తెగ పెట్టేస్తుంది. తరచూ తన కుమార్తెలతో ఫొటోలను పెట్టి వారితో సరదాగా గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకుంటుంది. ఆ విధంగానే ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుని ఫొటోలు పోస్ట్ చేసింది. 40 అనే అంకెతో కూడిన డికెరేషన్‌తో హాయిగా పడుకుని వున్న ఫొటోతో ఫోజు ఇచ్చి తనకు ఏ మాత్రం అందం తగ్గలేదని చూపుతోంది. ఆమెను అభిమానించేవారు కూడా చాలానే వున్నారు.
తన కూతురు సుప్రీత ఇద్దరూ కలిసి చేసే హంగామా మామూలుగా వుండదు. బుధవారం రాత్రి వేడుకలు జరుపుకుంది. ఈ వేడుకలకు సురేఖ కూతురు సుప్రీత, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సురేఖ సంబరాలు చేసుకుంది. అయితే ఈ వేడుకలో తన భర్త సురేష్ తేజ ఫొటోను కేక్ ముందు పెట్టుకొని మరోసారి ప్రేమను చాటుకుంది. పరిమిత సభ్యులతో కరోనా టైంలో చేసుకున్నా. బయటకు వెళదామంటే కోవిడ్ అడ్డుపడింది. అందరూ సేఫ్‌గా వుండంటూ ట్వీట్ చేసింది.