సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (18:18 IST)

నకిలీ మనుషులను దూరం పెట్టండి.. అప్పుడే జీవితం..? సురేఖా వాణి

Surekha Vani
నటి సురేఖా వాణి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తూనే వున్నారు. గతంలో కూతురు సుప్రీతతో కలిసి డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోల ద్వారా ఆమె వార్తల్లో నిలిచే వారు. కానీ ప్రస్తుతం రెండో పెళ్లిపై వార్తలు నిలుస్తున్నారు. ఈ మధ్య సురేఖ రెండో వివాహానికి సిద్ధమైందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని పలు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై  సురేఖతో పాటు ఆమె కూతురు కూడా ఘాటుగా స్పందించారు.
 
వాస్తవాలు రాయండి.. కొత్తవి క్రియేట్ చేసి రాయకండి అంటూ మీడియాపై కౌంటర్లు వేశారు సుప్రిత. తమపై వచ్చే రూమర్లకు ఎప్పటికప్పుడు చెక్‌ పెడుతుంటారు. అయితే తాజాగా సురేఖ వాణి చేసిన పోస్ట్‌ మరోసారి ఆమెను వార్తల్లో నిలిచేలా చేసింది. 
 
ఇందులో నకిలీ మనుషులను దూరం పెట్టండి.. ఒట్టి మాటలను నమ్మకండి.. అలాంటప్పుడే మన జీవితం సంతోషంగా సుఖంగా ఉంటుంది అంటూ ఓ పోస్ట్‌ను షేర్‌ చేసింది. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టిందన్నది చెప్పలేదు. దీంతో ఆమె జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలని ఉద్దేశించి సురేఖ వాణి ఆ కామెంట్స్‌ చేసిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.