గురువారం, 13 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 9 జులై 2022 (18:34 IST)

ఈ మధ్య రాజమౌళిగారితో మాట్లాడుతున్నప్పుడు ఇదే చెప్పారు- అక్కినేని నాగార్జున

Nagarjuna,  Praveen Sattaru, Sarath Marar, Pushkur Ram Mohan Rao
Nagarjuna, Praveen Sattaru, Sarath Marar, Pushkur Ram Mohan Rao
కింగ్ అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్ ' చిత్రం ప్రమోషన్‌ లను 'కిల్లింగ్ మెషిన్' తో ప్రారంభించారు. ఈ చిత్రం నుండి కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.  కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ లో నాగార్జున, తనపైకి వచ్చిన ఓ గుంపుని కత్తులతో తెగ నరకడం చాలా స్టైలిష్, యాక్షన్ ప్యాక్డ్ గా వుంది. నాగార్జున చాలా ఫిరోషియస్ అండ్ టెర్రిఫిక్ గా కనిపించారు. యువ సంగీత దర్శకులు భరత్ - సౌరభ్  ఇచ్చిన బీజీయం ఈ గ్లిమ్ప్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్ళింది.
 
కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ 'ది ఘోస్ట్' పై మరిన్ని భారీ అంచనాలు పెంచింది. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా దాదాపు పూర్తి కావచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని కిల్లింగ్ మెషిన్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. నాగార్జున కల్ట్ క్లాసిక్, పాత్ బ్రేకింగ్ మూవీ 'శివ' కూడా 1989లో అదే తేదీన విడుదల కావడం విశేషం.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగార్జునతో పాటు నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నటులు మహేంద్ర, క్రిష్, రవి వర్మ  పాల్గొన్నారు.
 
నాగార్జున మాట్లాడుతూ.. 'ది ఘోస్ట్ 'లో మేజర్ హైలెట్ యాక్షన్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ ని అద్భుతంగా తీశారు. కిల్లింగ్ మెషిన్ జస్ట్ గ్లింప్స్ మాత్రమే, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు టెర్రిఫిక్ గా వుంటాయి. చాలా రోజుల తర్వాత నేను ట్రైనింగ్ తీసుకొని యాక్షన్ సీన్స్ చేశా. ఇలాంటి యాక్షన్ గతంలో నేను చేయలేదు, నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా ఎక్సయిటింగ్ గా వుంది.  సునీల్ నారంగ్ గారి నాన్నగారు  నారాయణ్ దాస్ నారంగ్ తో ఈ సినిమా చేయాలనే ఆలోచన మొదలైయింది. పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లాంటి మంచి అభిరుచి గల నిర్మాతలు కలసి సినిమా అద్భుతంగా రూపొందించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా వుంటాయి. చిత్రానికి మంచి టెక్నికల్ టీం పని చేసింది. సోనాల్ చౌహాన్ కూడా ఇందులో సరికొత్త పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు ఎమోషన్ , సిస్టర్ సెంటిమెంట్ కూడా వుంటుంది. అక్టోబర్ 5న సినిమాని మీ ముందుకు తెస్తున్నాం'' అన్నారు
 
దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.. నాగార్జున గారితో సినిమా చేసే అవకాశం రావడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తాను. నాకు యాక్షన్ సినిమాలు ఇష్టం. నాగార్జున గారు స్టైలిష్ యాక్షన్ లో అద్భుతంగా వుంటారు. ఈ చిత్రంలో అది గొప్పగా కుదిరింది.  సినిమా మొదలైన తర్వాత కరోనా రూపంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చాయి. ఐతే మా నిర్మాతలు సునీల్ నారంగ్, , పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ గారు గొప్ప సపోర్ట్ గా నిలబడ్డారు. టెక్నికల్ టీం, డైరెక్షన్ టీమ్ కి కృతజ్ఞతలు'' తెలిపారు. 
 
శరత్ మరార్ మాట్లాడుతూ.. నాగార్జున గారు లాంటి హీరో తో పని చేయడం ఎప్పుడూ ఆనందంగానే వుంటుంది. నాగార్జున గారు ప్రాజెక్ట్ ఆరంభమైనప్పటి నుండి గొప్ప సహకారాన్ని అందించారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు అండ్ టీం చాలా క్లారిటీతో పని చేశారు. లాక్ డౌన్ లాంటి ప్రతికూల పరిస్థితులలో కూడా ఎక్కడా నిరుత్సాహ పడకుండా గొప్ప అవుట్ పుట్ ఇచ్చారు. సినిమా అద్భుతంగా వచ్చింది. అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు వున్నాయి. అక్టోబర్ 5న ది ఘోస్ట్ ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తోంది'' అన్నారు.
 
పుస్కుర్ రామ్ మోహన్ రావు మాట్లాడుతూ.. నాగార్జున గారి ట్రెండ్ సెట్టర్ శివ విడుదలైన అక్టోబర్ 5న 'ది ఘోస్ట్' సినిమా వస్తుండటం, అలాగే దసరా కూడా కలసిరావడం డబుల్ ధమాక. యాక్షన్ కమర్షియల్ సినిమా ఇది, నాగార్జున  చాలా భిన్నంగా కనిపిస్తున్నారు.  ప్రవీణ్ సత్తారు చిత్రాన్ని అద్భుతంగా తీశారు. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. సినిమా మీ అందరినీ అలరిస్తుంది'' అన్నారు.
 
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది ఘోస్ట్ టీమ్
 
 శివలో చైన్ పెట్టారు ఘోస్ట్ లో రెండు కత్తులు పెట్టారు మరో శివలా అంచనాలు పెట్టుకోవచ్చా ?
నాగార్జున : శివకి దీనికి పోలిక లేదు. యాక్షన్ స్టైలిష్ గా డిజైన్ చేసిన క్రమంలో కత్తులు వచ్చాయి. 
 
ఎవరికీ ఘోస్ట్ గా వుంటారు ?
నాగార్జున: ఘోస్ట్ అంటే దెయ్యం అని కాదు. స్టైలిష్ పోల్ ఏజెంట్ విక్రమ్ కి కోడ్ నేమ్.
 
 ఇన్నేళ్ళ మీ అనుభవంలో ఎలాంటి పాత్రలు, ఎలాంటి కథలని ప్రేక్షకులు యాక్సప్ట్ చేస్తున్నారనిపించింది ?
నాగార్జున: నిజంగా తెలీదండి. నాకే కాదు ఇది ఎవరికీ తెలియదని అనుకుంటాను. ప్రేక్షకులకు ఎప్పుడు, ఎందుకు ఒక సినిమా నచ్చుతుందో తెలీదు. ఈ మధ్య రాజమౌళి గారితో మాట్లాడుతున్నప్పుడు ఇదే టాపిక్ వచ్చింది. ''మన మనసుకు నచ్చిన సినిమా బలంగా నమ్మి తీసేయాలి. మనకి నమ్మకం ఉంటేనే జనాలకి నచ్చుతుంది' అన్నారు.
 
ప్రవీణ్ సత్తారు గారు చెప్పిన కథలో కొత్త పాయింట్ ఏమిటి ?
నాగార్జున:  ట్రీట్మెంట్, యాక్షన్ డిజైన్ చాలా కొత్తగా వుంటుంది. ఈ ట్రెండ్ కి తగ్గట్టు వుంటుంది.
 
ఈ చిత్రానికి టికెట్ రేట్లు ఎలా వుంటాయి. 
సునీల్ నారంగ్: సాధారణమైన ధరలే వుంటాయి. టికెట్ రేట్లు పెంచం.
 
మిషన్ బేస్డ్ సినిమాలకి సీక్వెల్స్ వుంటాయి కదా .. ఘోస్ట్ కి సీక్వెల్ వుంటుందా ?
ప్రవీణ్ సత్తారు : ఇది మిషన్ బేస్డ్ సినిమా కాదు. మీరంతా రివ్యూలు చక్కగా రాసి సినిమా సూపర్ హిట్ అయితే ఎన్ని సీక్వెల్స్ అయినా తీసుకోవచ్చు( నవ్వుతూ)
నాగార్జున గారు మన్మధుడు కదా..  ఆయన్ని యాక్షన్ చేయించడానికి ఎంత కష్టపెట్టారు ?
ప్రవీణ్ సత్తారు : నాగార్జున గారు నన్ను చాలా సర్ప్రైజ్ చేశారు. చాలా అలోచించి ఒక యాక్షన్ బ్లాక్ పెడితే.. ఆయన వచ్చి చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారు. 12 భారీ యాక్షన్ సీక్వెన్స్ లు వున్నాయి. నాగార్జున గారు చాలా ఫ్లెక్స్ బుల్ గా సూపర్ ఫాస్ట్ గా చేశారు.
 
 యాక్షన్ లో కొత్తదనం ఏముటుంది ?
ప్రవీణ్ సత్తారు: ఇందులో యాక్షన్ కథలో కలసి వుంటుంది. యాక్షన్ కూడా ఎమోషన్ లో బాగంగా వుంటుంది. యాక్షన్ చాలా ఆర్గానిక్ గా వుంటుంది.
నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
 
బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు