ఈ విజయం మాకు ఎంతో ప్రత్యేకంః నరసింహపురం చిత్ర బృందం
జులై 30న విడుదలైన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'నరసింహపురం' చిత్రం అనూహ్య విజయం సాధిస్తోంది. హీరో నందకిషోర్ నటన, శ్రీరాజ్ బళ్లా దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విజయ సమావేశం ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకుంది.
`నరసింహపురం` చిత్రాన్ని గుండెలకు హత్తుకుంటున్న ప్రేక్షకులకు హీరో నందకిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తనకే కాకుండా ఈ చిత్రంలో నటించిన, ఈ చిత్రం కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రత్యేకం అని పేర్కొన్నారు. రెండేళ్ల తమ కష్టానికి ప్రతిఫలం దక్కుతుండడం పట్ల దర్శకనిర్మాతలు శ్రీరాజ్ బళ్లా-ఫణిరాజ్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. హిట్ దిశగా దూసుకుపోతున్న `నరసింహపురం`లో నటించే, పని చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ఉష, కల్యాణ మాధవి, సంపత్ కుమార్, సాయి రాజ్, సంగీత దర్శకుడు ఫ్రాంక్లిన్ సుకుమార్, గీత రచయిత గెడ్డం వీరు కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాతగా తనకు మూడు కమర్షియల్ సక్సెస్ లు ఇచ్చిన శ్రీరాజ్ "నరసింహపురం"తో సూపర్ హిట్ కొట్టడం గర్వంగా ఉందన్నారు ముఖ్య అతిథి తుమ్మలపల్లి. యూనిట్ సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలిపారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.