మంగళవారం, 1 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 6 జూన్ 2016 (12:43 IST)

ధనుష్- కీర్తి సురేష్‌ల తొడరి ఆడియో రిలీజ్.. కీర్తి-ధనుష్ గుసగుసలు.. (ఫోటోలు)

ధనుష్ ప్రభు సాల్మన్‌ల రైలు నేపథ్య చిత్రానికి తొడరి అనే పేరు ఖరారైన సంగతి తెలిసిందే. ఇప్పటికే అభిమానుల నుంచి కూడా కొత్త టైటిల్‌తోపాటు విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ స్టిల్స్‌ అదుర్స్ అంటూ భారీ స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదలైంది. ఈ ఆడియో కార్యక్రమంలో ధనుష్, కీర్తి సురేష్ తదితర కోలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. 
 
లవ్‌ కమ్ థ్రిల్లింగ్‌ ట్రైన్‌ జర్నీ సబ్జెక్టుతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో ధనుష్‌ ఒక స్టిల్‌లో, కదులుతున్న రైలు వెనక భాగాన వాకీ టాకీతో మాట్లాడుతూ టెన్షన్‌గా కనిపిస్తాడు. ధనుష్‌, కీర్తిసురేష్‌లు ఒక బోగీ నుంచి ఇంకో బోగీ మీదకు దూకేందుకు ప్రయత్నిస్తున్న మరో స్టిల్‌ ఈ చిత్రంపై ఆసక్తిని, అంచనాల్ని పెంచేశారు. ప్రభుసాల్మన్‌ ఈ సినిమా ఆడియోను విడుదల చేసిన నేపథ్యంలో పాటలకు మంచి క్రేజ్ వస్తుందని సినీ పండితులు అంటున్నారు.