బుధవారం, 29 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (09:27 IST)

టైగర్ నాగేశ్వరరావు పోస్టర్ లో రవితేజ్ కాలి వేళ్ళు మాత్రమే ఎందుకు వేసారో తెలుసా!

Tiger Nageswara Rao's Toes Poster
Tiger Nageswara Rao's Toes Poster
రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. గ్రిప్పింగ్ టీజర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు రవితేజ్ గురించి, పోస్టర్ లో లెగ్ మాత్రమే ఎందుకు వేసారో తెలిపారు. 
 
Ram laxman ph
Ram laxman ph
మేము కూడా స్టువర్ట్ పురం ప్రాంతంలోనే పుట్టి పెరిగాం. ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి చిన్నప్పుడు వూర్లో కథలు కథలుగా విన్నాం. ఆ రకంగా ఈ కథ మాకు కొంచెం దగ్గరగా కనెక్ట్ అయింది. రవితేజ గారు కూడా ఈ క్యారెక్టర్ చాలా బాగా యాప్ట్ అయ్యారు. అన్నీ కథకు బాగా కుదిరాయి.  టైగర్ నాగేశ్వరరావు యాక్షన్ ని రియలిస్టిక్ గా కంపోజ్ చేశాం.
 
‘టైగర్ నాగేశ్వరరావు’ గారి గురించి ఊహకు అందని విషయాలు విన్నాం. రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారని, దొంగతనం చేస్తానని చెప్పి మరీ చేసేవారని, చెట్లపై కూడా పరిగెత్తెవారని..  ఇలా చాలా ఆసక్తికరమైన విషయాలు వినేవాళ్ళం. సవాల్ చేసి దొంగతనం చేయడం అంత ఈజీ కాదు.  అందరికీ చెప్పి దొంగతనం చేసి అక్కడ నుంచి తప్పించుకునే ఒక పాత్రని చూస్తున్నపుడు రియల్ హీరోయిజం కనిపిస్తుంది. 
 
- ఆయన కాలి వేళ్ళతో పరిగేతేవాడు. ఈ స్పీడ్ చూసి జపాన్, కొరియా వాళ్ళు గుర్తుకువచ్చారు. చెట్లపై కూడా కొమ్మలు పై ఆకులు పై కూడా పరిగెత్తడం మాకు ఆచర్యం కలిగింది. ఆయన గురించి కథలు చెప్పుకునేవారు. అందుకే కాలి వేళ్ళు పోస్టర్ వేశారు. 
 
- ఆయన చెన్నై జైలు నుంచి ఎస్కేప్ అయ్యారు. ఆయనకి టైగర్ అనే బిరుదు పోలీసులు ఇచ్చారు. ఒక దొంగకి పోలీసులు బిరుదు ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరమైన అంశం. మేము ఒక ఫైట్ తీసినప్పుడు రోఫ్ కడతాం, బోలెడు ఏర్పాట్లు చేస్తాం. అలాంటిది  టైగర్ నాగేశ్వరరావు ఏ సాయం లేకుండా అంత ఎత్తు జైలు గోడలు ఎలా ఎక్కగలిగారు, ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ వచ్చి వుంటుందనేది నిజంగా ఆశ్చర్యకరం. ఒక దొంగ ఇంత పాపులర్ అయ్యారంటే దాని వెనుక నేచర్ సపోర్ట్, ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. అసలు ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎవరు ? అని ఒక ప్రధాన మంత్రి దగ్గర కూడా గుర్తింపు పొందడం మామూలు విషయం కాదు.  
 
ఇందులో యాక్షన్ ని చాలా రియలిస్టిక్ గా కంపోజ్ చేశాం. ఆయన నివసించిన చీరాల ప్రాంతంలో  జీడి తోటల్లో నే కొన్ని యాక్షన్ సీన్స్ కంపోజ్ చేశాం. రవితేజ గారితో ఎన్నో చిత్రాలు పని చేశాం. ‘టైగర్ నాగేశ్వరరావు’ మాత్రం మాకు కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇందులో ప్రతి యాక్షన్ ఎపిసోడ్ ని ప్రేక్షకులు రియల్ గా ఫీలౌతారు. రవితేజ గారు చాలా కష్టపడ్డారు అని తెలిపారు.