1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 అక్టోబరు 2023 (16:01 IST)

సంఘ సంస్కర్త హేమలతా లవణంగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య

renudesai in tiger
సినీ హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రముఖ సంఘ సంస్కర్త హేమలతా లవణం పాత్రలో కనిపించనున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానరుపై వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హేమలతా లవణం పాత్రలో ఆమె నటిస్తున్నారు. రేణూ దేశాయ్ పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం నేడు పంచుకుంది.
 
కాగా, మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం "టైగర్ నాగేశ్వరరావు". ఈ సినిమా ట్రైలరును అక్టోబరు 3న విడుదల చేయనున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో ఘనంగా నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. దసరా సీజనులో అక్టోబరు 20న టైగర్ నాగేశ్వరరావు చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
 
కాగా, ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు. రవితేజ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. అంతేకాదు, రవితేజకు ఇదే తొలి పాన్ ఇండియా చిత్రం. టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.