1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (17:45 IST)

విజయ్ ఆంటోనీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ హిట్లర్ ఫస్ట్ లుక్

Hitler First Look
Hitler First Look
పలు వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా హిట్లర్ తో తెరపైకి రాబోతున్నాడు. విజయ్ ఆంటోనీతో గతంలో విజయ్ రాఘవన్ అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా హిట్లర్ సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. హిట్లర్ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్  చేశారు.
 
ట్రైన్ జర్నీలో ఉన్న హీరో విజయ్ ఆంటోనీ ఒక క్రైమ్ ఇన్సిడెంట్ ను ఎదుర్కొన్నట్లు మోషన్ పోస్టర్ లో చూపించారు. ఇదే ట్రైన్ లో హీరోయిన్ రియా సుమన్ హీరో కలుసుకుంటాడు. గన్ పేలుస్తోన్న గౌతమ్ మీనన్ ఓ కీలక పాత్రలో కనిపించారు. మోషన్ పోస్టర్ లో విజయ్ ఆంటోనీ ఫ్రెష్ లుక్ లో ఉన్నారు. చివరలో ఆయన జోకర్ గెటప్ లో కనిపించడం ఆసక్తికరంగా ఉంది. ట్రైన్ జర్నీ నేపథ్యంగా రూపొందించిన మోషన్ పోస్టర్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
 
ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ పౌరుడి కథే హిట్లర్. హిట్లర్ ఒక పేరు కావొచ్చు కానీ ఇప్పుడున్న ప్రజాస్వామ్య పరిస్థితుల్లో ఆ పేరు నియంతలకు మారుపేరుగా మారింది. అందుకే సినిమాకు ఈ టైటిల్ యాప్ట్ అనుకున్నాం అని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న హిట్లర్ మూవీని త్వరలో పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తమిళ,తెలుగు,మలయాళ, కన్నడ భాషల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు.
 
నటీనటులు- విజయ్ ఆంటోనీ, రియా సుమన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు