1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (10:03 IST)

మంచు విష్ణు తో నూపూర్ సనన్ కు విభేదాలు

Nupur-vishnu
Nupur-vishnu
న్యూఢిల్లీకి చెందిన సంగీత కళాకారిణి, నటి నుపూర్‌ సనన్‌. లేటెస్ట్ గా రవితేజ తో  టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటిస్తోంది. సినీనటి కృతి సనన్ సోదరి కూడా.  బాలీవుడ్ లో నూరానీ చెహ్రా, బి ప్రాక్: ఫిల్హాల్ చిత్రాలలో పేరుతెచ్చుకుంది. అలాంటి నటి మంచు విష్ణు నటిస్తున్న భక్త కన్నప్ప లో నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ కూడా  ప్రారంభం అయింది. మోహన్ బాబు దర్శకుడు. అలనాడు కృష్ణం రాజు నటించిన భక్త కన్నప్ప చిత్రానికి ఇదే రీమేక్. ఇందులో ప్రభాస్ కూడా నటుస్తున్నాడు. ఇదంతా బాగానే ఉంది. సడెన్ గా నుపుర్ ఈ సినిమా నుంచి బయటకు వచ్చింది.
 
దీనిపై విష్ణు ఓ ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ విభేదాల కారణంగా కన్నప్ప నుండి వైదొలగవలసి వచ్చింది. మేము ఆమెను కోల్పోతాము, కానీ మా కొత్త ప్రముఖ మహిళ కోసం వేట ప్రారంభమవుతుంది. నూపూర్‌కి ఆమె ఇతర కట్టుబాట్లపై మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సమీప భవిష్యత్తులో ఆమెతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను అని తెలిపారు.