శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (17:20 IST)

ఆయన్ని చూసినప్పుడు ఏం మాట్లాడలేకపోయాను : గోల్డీ నిస్సీ

Goldie Nissi
Goldie Nissi
రవితేజ ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్స్ లో మరో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మించారు. ‘C/o కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా, గోల్డీ నిస్సీ హీరోయిన్. రవిబాబు, సత్య ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రోడ్యూసర్స్. సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ‘ఛాంగురే బంగారురాజా’ విడుదలౌతున్న నేపథ్యంలో  హీరోయిన్ గోల్డీ నిస్సీ  విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
-  నేను తెలుగమ్మాయిని. ఇంజనీరింగ్ చదువుకునే రోజుల నుంచే నటనపై ఆసక్తి వుండేది. కొన్ని షార్ట్స్  ఫిలిమ్స్ చేశాను. సినిమాలకి ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాను. రవితేజ గారి ప్రొడక్షన్ లో సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని ఆడిషన్స్ ఇచ్చాను. నా ఆడిషన్స్ నచ్చి సెలెక్ట్ చేశారు. ‘ఛాంగురే బంగారురాజా’ నా ఫస్ట్ బిగ్ సినిమా.
 
- మా అమ్మగారు చాలా ప్రోత్సహిస్తారు. నా ఇష్టాన్ని అర్ధం చేసుకొని ఆమెనే స్వయంగా నన్ను చాలా ఆడిషన్స్ కి తీసుకెళ్ళారు. ఈ విషయంలో మా అమ్మకి ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే.
 
- ఇందులో నా పాత్ర పేరు మంగరత్నం. తను కానిస్టేబుల్. కొంచెం గ్రే షేడ్ వుంటుంది. మంగరత్నం ను బంగార్రాజు ఇష్టపడతాడు. లవ్ ట్రాక్ చాలా ఆసక్తికరంగా వుంటుంది.
 
-  రవితేజ గారి నిర్మాణంలో నా మొదటి సినిమా చేయడం చాలా అదృష్టంగా ఫీలౌతున్నాను. ఇది నెక్స్ట్ లెవల్ ఫీలింగ్. ఇందులో నా పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఇందులో నా పాత్రకు పెర్ఫార్మ్ చేసే స్కోప్ వుంది. భవిష్యత్ లో మంచి కంటెంట్ వున్న కథలు వస్తే అన్ని రకాల పాత్రలు చేయాలని వుంది.
 
-  మేము షూటింగ్ పూర్తయిన తర్వాతే రవితేజ గారిని కలిశాం. ఆయన్ని చూసినప్పుడు ఏం మాట్లాడలేకపోయాను. ఆయన మాత్రం .. ‘’సినిమా చూశాను. అందరూ చాలా బాగా చేశారు. నువ్వు కొత్త అయిన భయం లేకుండా నటించావ్’’ అని మెచ్చుకున్నారు. చాలా అనందంగా అనిపించింది.
 
- నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నపుడు కూడా ఫ్రీ లాన్సింగానే చేశాను. ఐతే సినిమా పై ప్యాషన్ ఎక్కువ అనిపించింది. ప్రయత్నిస్తున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోదామా అనే ఆలోచనలు కూడా వస్తాయి. ఐతే రెండేళ్ళ నిరీక్షణకు సరైన ఫలితం వచ్చిందనే భావిస్తున్నాను.
 
- అరిస్ట్ గా ప్రయోగాత్మక పాత్రలు చేయాలని వుంటుంది. అన్ని రకాల పాత్రలతో అలరించాలని వుంది.