శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (15:21 IST)

టైగర్ ష్రాఫ్‌తో దిశా పటానీ.. అడ్డంగా చిక్కిపోయింది...

బాలీవుడ్ హీరో హీరోయిన్లు టైగర్ ష్రాఫ్, దిశా పటానీ. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్ ఇండస్ట్రీ కోడైకూస్తోంది. ఇపుడు ప్రచారం నిజమైంది. వీరిద్దరూ కెమెరా కంటికి అడ్డంగా దొరికిపోయారు. ఈ వివరాలను తెలుసుకుందాం. 
 
నిజానికి టైగర్ ష్రాఫ్, దిశా పటానీలు గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. గతంలో వారిద్దరూ ఎన్నోసార్లు కెమెరా కంటికి  చిక్కారు కూడా. కానీ, వాళ్ల మధ్య ఉన్న ప్రేమ గురించి మాత్రం ఏనాడూ నోరు విప్పలేదు. 
 
తాజాగా మరోసారి వీళ్లు కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. ఈసారి మరో ట్విస్ట్ ఏంటంటే.. దిశా, టైగర్ ష్రాఫ్‌తో పాటు అతడి సోదరి కృష్ణ ష్రాఫ్‌తో కలిసి ముంబై రెస్టారెంట్‌లో డిన్నర్ చేసింది. రెస్టారెంట్‌కు వెళ్తుండగా వీళ్లను కెమెరాలు క్లిక్‌మనిపించాయి. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
టైగర్ సోదరి కృష్ణ ఫిటెన్‌స్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తుందట. ఇదివరకు చాలాసార్లు కృష్ణతో కలిసి ఈ జంట డిన్నర్ చేసింది. ప్రస్తుతం దిశా పటానీ.. సల్మాన్ ఖాన్ మూవీ "భరత్‌"లో నటిస్తుండగా.. తన బాయ్ ఫ్రెండ్ టైగర్‌తో రెండు సినిమాలు "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2", "బాఘీ-3"లో నటిస్తోంది.