గురువారం, 10 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (10:51 IST)

రావణాసుర కోసం టైం బ్రేక్‌ చేసుకోండి : నిర్మాత నామా

Raviteja dubbing
Raviteja dubbing
మాస్‌ మహారాజా రవితేజ తాజా మూవీ రావణాసుర. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లింగ్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ లో మాస్‌ మహారాజా పక్కా పవర్ఫుల్‌ రోల్‌ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి. రవితేజ డబ్బింగ్‌ చెబుతున్న కనిపించి కనిపించని ఓ ఫొటోను చిత్ర నిర్మాత అభిషేక్‌ నామా పోస్ట్‌ చేశాడు. మాస్‌ మహారాజను చూడని కొత్త అవతారంలో మీరు చూడబోతున్నారు. రావణాసుర అకోసం టైంను బ్రేక్‌ చేసుకుని సిద్ధంగా వుండండి అంటూ ట్వీట్‌ చేశాడు. అంతేకాకుండా ఏప్రిల్‌ 7, 2023 న రిలీజ్‌ చేస్తున్నట్లు తెలిపారు.
 
ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్‌, మేఘ ఆకాష్‌, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్‌, ఫరియా అబ్దుల్లా తదితరులు నటిస్తున్నారు అభిషేక్‌ పిక్చర్స్‌, రవితేజ టీం వర్క్స్‌ బేనర్‌పై అభిషేక్‌ నామ నిర్మిస్తున్న రావణాసుర చిత్రానికి హర్షవర్షన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌ సిసిరోలియో మ్యూజిక్‌ అందిస్తున్నారు.