శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By రామన్
Last Updated : ఆదివారం, 17 మే 2020 (09:47 IST)

42 యేళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్!! ఎవరు?

తెలుగు చిత్రపరిశ్రమలో ఒకపుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సంఘవి. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన "సింధూరం" చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ప్రస్తుతం ఈమె వయసు 42 యేళ్లు. ఈ వయసులో ఆమె ఓ అందమైన బేబీకి జన్మనిచ్చింది. ఆ బేబీ ఫోటోలను అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
కాగా, సంఘవి 1990లో ఓ వెలుగు వెలిగి.. అనేక మంది అభిమానుల మనసులను గెలుచుకుంది. తన ప్రతిభతో పాటు.. అంద చందాలతో సంఘవి సినీ ఇండస్ట్రీలో రాణించింది. సంఘవి అసలు పేరు కావ్య రమేష్. ఆమె అమరావతి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 
 
అంతేకాకుండా, సింధూరం చిత్రంలోని నటనకుగాను సంఘవికి నంది అవార్డు కూడా వరించింది. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన తర్వాత ఆమె వెంకటేష్ అనే వ్యక్తిని గత 2016లో వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది.