బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 14 మే 2020 (13:47 IST)

లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్‌కి పెద్ద ఛాలెంజే..!

కరోనా కారణంగా లాక్ డౌన్ వచ్చి సినీ పరిశ్రమకు పెద్ద నష్టాన్నే మిగిలిచ్చింది. త్వరలో లాక్ డౌన్ ఎత్తేస్తారు.. హమ్మయ్యా అనుకోవడానికి లేదు. సినిమా ఇండస్ట్రీకి అసలైన కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే.... ఇక నుంచి సినిమాలను అవుట్‌డోర్లో కంటే ఇన్ డోర్ లోనే చేసుకోవాల్సి రానుంది. అలాగే చాలా తక్కువ మంది టీమ్‌తో సినిమా షూటింగ్‌లు చేసుకోవాలి. 
 
అంతేకాకుండా.. మాస్క్‌లు, శానిటైజర్ ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. ఇలా... ఇండస్ట్రీకి కొత్త రూల్స్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. 
 
దీని వలన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కాస్త ఇబ్బందే. అలాగే నిర్మాతకు అయితే... మరీ ఇబ్బంది. రియల్ లోకేషన్లో షూటింగ్‌కి అనుమతి ఇవ్వరు. ఆ లోకేషన్‌ని సెట్లా వేయాలంటే నిర్మాతకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 
 
ఇలా.. కొత్త ఇబ్బందులు... బడ్జెట్లు పెరగడం తదితర కారణాల వలన చాలామంది నిర్మాతలు నిర్మాణానికి దూరమయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే.. లాక్ డౌన్ ఎత్తేసినా సినీ కార్మికులకు సరిపడా పనులు ఉండకపోవచ్చు. ఈ విధంగా టాలీవుడ్‌కి 2020 అనేది పెద్ద ఛాలెంజ్. 
 
మరి.. ప్రభుత్వం ఎలాంటి రూల్స్ ప్రవేశపెట్టనుందో..? దీనికి పరిశ్రమ పెద్దల నుంచి ఎలా స్పందన వస్తుందో చూడాలి.