శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By mohan
Last Modified: శుక్రవారం, 2 జూన్ 2017 (13:32 IST)

కామెడీ హీరోలు వాటి కోసం ఎగబడుతున్నారు... దర్శకులు అందుకే తప్పిస్తున్నారా...?

గత కొన్నేళ్లగా సినిమాలల్లో కమెడియన్లకు పాత్రలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రముఖంగా తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సంవత్సరాల పాటు పోటీ లేకుండా రాణించిన బ్రహ్మానందం తదితర సీనియర్ హాస్య నటులకు ఇప్పుడు అవకాశాలు లేకుండా ఉండిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగ

గత కొన్నేళ్లగా సినిమాలల్లో కమెడియన్లకు పాత్రలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రముఖంగా తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సంవత్సరాల పాటు పోటీ లేకుండా రాణించిన బ్రహ్మానందం తదితర సీనియర్ హాస్య నటులకు ఇప్పుడు అవకాశాలు లేకుండా ఉండిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి పారితోషికం హీరోలతో సమానంగా వుండటంతో పాటు వీరికి పోటీగా కొత్తవారు రంగంలోకి దిగడంతో వ్యవహారం బెడిసికొట్టింది. మరోవైపు పెద్ద హీరోలు సైతం వీరిని పక్కన పెట్టడం జరుగుతోంది. కథలో భాగంగా హీరోలతోనే పంచ్‌లు వేయించేస్తున్నారు దర్శకులు. 
 
బిజినెస్‌మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 1 నేనొక్కడినే, శ్రీమంతుడు సినిమాలలో మహేష్ బాబు కామెడీ పండించాడు. ఇక టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలలో ఎన్టీఆర్ తనదైన శైలిలో కామెడీ లాగించేశాడు. దర్శకులు కొత్త వారికి ఛాన్స్ ఇస్తుండటంతో సీనియర్ కామెడీ నటులు బేజారు అవుతున్నారు. అదలావుంచితే కమెడియన్‌లు కొంచెం క్లిక్ అయితే చాలు హీరోలుగా నటించేందుకు ఎగబడుతుండటం కూడా కమెడియన్‌లకు కాలం చెల్లిపోయినట్లనిపిస్తోంది.