ముఠామేస్త్రీ నిర్మాత కేసీ శేఖర్ బాబు కన్నుమూత.. మెగాస్టార్ సంతాపం
ముఠామేస్త్రీ, సుబ్బరాజు గారి కుటుంబం, మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, సర్దార్ వంటి సినిమాలకు నిర్మాణ సారథ్యం వహించిన టాలీవుడ్ నిర్మాత, ముఠామేస్త్రీ ప్రొడ్యూసర్ శేఖర్ బాబు గుండ
ముఠామేస్త్రీ, సుబ్బరాజు గారి కుటుంబం, మమత, సంసారబంధం, గోపాలరావుగారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, సర్దార్ వంటి సినిమాలకు నిర్మాణ సారథ్యం వహించిన టాలీవుడ్ నిర్మాత, ముఠామేస్త్రీ ప్రొడ్యూసర్ శేఖర్ బాబు గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలో ఉంటున్న ఆయన అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితం శేఖర్ బాబు గుండెకు ఆపరేషన్ జరిగింది.
1946 మే 1న కేసీ శేఖర్‌బాబు జన్మించారు. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కాగా నిర్మాతల మండలి, ఫిల్మ్‌ఛాంబర్‌లో పనిచేసిన శేఖర్ బాబు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా శేఖర్‌బాబు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
చిరంజీవి, రోజా, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన హిట్ సినిమా 'ముఠామేస్త్రి', సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన 'చిలకమ్మ' తదితర సినిమాలను శేఖర్ బాబు నిర్మించారు. శేఖర్ బాబు తండ్రి డిస్ట్రిబ్యూటర్. కృష్ణా జిల్లా కోవవెన్ను శేఖర్ బాబు స్వగ్రామం.