ఆదివారం, 23 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2016 (17:03 IST)

సినిమా హిట్టా.. ఫట్టా అని చెప్పేవాడు ఇప్పటివరకు పుట్టలేదు : నిర్మాత శివకుమార్‌

తెలుగు చిత్రపరిశ్రమలో ఓ సినిమా ఎలా ఆడుతుందనీ.. మరో సినిమా ఎందుకు ఆడదు? కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయో అర్థంకాదు. ఇదంతా వెయ్యిడాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది. చాలామంది సినిమా తీసేటప్పుడు కొంత ఎనలైజ్‌ చేస్

తెలుగు చిత్రపరిశ్రమలో ఓ సినిమా ఎలా ఆడుతుందనీ.. మరో సినిమా ఎందుకు ఆడదు? కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయో అర్థంకాదు. ఇదంతా వెయ్యిడాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది. చాలామంది సినిమా తీసేటప్పుడు కొంత ఎనలైజ్‌ చేస్తూ.. బాగా ఆడుతుందని తీస్తారు. తీశాక పెద్దగా ఆడదు. కొంతమంది ఏదో ఆడితే చాల్లే అనుకుంటారు. కానీ అనూహ్యవిజయం దక్కుతుంది. మరికొంతమంది బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయి రూ.కోట్లు పెట్టి తీస్తారు. విడుదల తర్వాత బొటాబొటిగా వసూళ్ళు రావచ్చు. రాకపోవచ్చు.. అందుకే వాన రాక.. ప్రాణం పోకడ తెలీదని.. తెలుగులో నానుడి.. అయితే సినిమాలోకూడా ఇలానే ఉంది. 
 
అసలు సినిమాలు ఏవి ఆడతాయో ఆడవో అనేది ఎవ్వరికీ తెలీదు. అలా చెప్పేవాడు పుట్టలేదు. ఒకవేళ అలాంటి వాడు పుట్టి వాడి తెలిసి చెబితే.. వెంటనే వాడిని చంపేస్తారు అంటూ ప్రముఖ నిర్మాత శివకుమార్‌ చెప్పారు. పాము నేపథ్యంతో 'కార్తికేయ' సినిమాను నిర్మించిన ఆయన తాజాగా 'నాగభరణం' సినిమాను పంపిణీ చేస్తూ శుక్రవారం విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం పాము నేపథ్యంగనుక ఆడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఎంతమేరకు ఆడుతుందోనేందుకు.. ఆయన పైవిధంగా సమాధానం చెప్పారు.