టాలీవుడ్ నిర్మాత కొడాలి బోసుబాబు గుండెపోటుతో మృతి
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నిర్మాత కొడాలి బోసుబాబు సోమవారం గుండెపోటుతో మరణించారు. ఈయనకు వయసు 66 యేళ్లు. దివంగత దాసరి నారాయణ రావుకు ఈయన సమీప బంధువు అవుతారు. దాసరి భార్య దివగంత దాసరి పద్మకు బోసుబాబు వరుసకు సోదరుడు అవుతారు.
ఈయన తెలుగు చిత్రపరిశ్రమలోకి దాసరికి మేనేజరుగా అడుగుపెట్టారు. ఆ తర్వాత దాసరి ఆశీస్సులతో నిర్మాతగా మారారు. సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలతో చిత్రాలు నిర్మించారు. ఈయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. బోసుబాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు.