శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మే 2022 (12:48 IST)

హీరో గోపీచంద్‌కు ప్రమాదం.. స్వల్ప గాయాలు

Gopichand
తెలుగు హీరో గోపీచంద్ తన కొత్త సినిమా సెట్స్‌లో ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఇటీవల "సీటీమార్"గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ ఇపుడు శ్రీవాస్ దర్శకత్వంలో తన 30వ చిత్రంతో బిజీగా ఉన్నారు. 
 
ఈ చిత్రం షూటింగ్ కర్నాటక రాష్ట్రంలో జరుగుతుంది. యాక్షన్ సన్నివేశాలు చేస్తున్న సమయంలో కాలు జారి కిందపడిపోయాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
సమాచారం తెలుసుకున్న అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన పరిస్థితి గురించి ఆందోళన చెందవద్దని చిత్ర బృందం అభిమానులను విజ్ఞప్తి చేసింది.