సమంతగా "యశోద" - ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం "యశోద". ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌ను శుక్రవారం విడుదల చేయనున్నారు. హరి అండ్ హరీష్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రాని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఈ నెల 5వ తేదీ శుక్రవారం ఉదయం 11.07 గంటలకు ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఆ తర్వాత టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలకమైన పాత్రను పోషించారు. ఈ పాత్రను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు.
ఇక ముఖ్యమైన పాత్రలో రావు రమేష్, సంపత్ రాజ్, మురళీ శర్మ, ఉన్న ముకుందన్ తదితరులు నటించారు. ఆగస్టు 12వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ సినమా తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుందని సమంత గట్టిగా భావిస్తుంది. ఇదిలావుంటే, ఆమె టైటిల్ రోల్ పోషించే శాకుంతలం చిత్రం కూడా సెట్స్‌పై ఉన్న విషయం తెల్సిందే.