సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (22:39 IST)

త్రిష పట్ల ఏవీ రాజు కామెంట్స్.. ఆ లిస్టులో చేర్చేశాడు..

Trisha
Trisha
చెన్నై చంద్రం త్రిష ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్‌లో వుంది. కారణం ఓ రాజకీయ వేత్త త్రిషపై కామెంట్స్ చేయడమే. పాపులర్ కావాలనుకున్నాడో ఏమో కానీ త్రిషపై వివాదాస్పద కామెంట్లు చేశాడు. స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌తో రేప్ సన్నివేశాన్ని మిస్ అయ్యానని కామెంట్లు చేసి విమర్శలను ఎదుర్కొన్న నటుడు మన్సూర్ ఖాన్ తరహాలో తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు ఏవీ రాజు, సేలం పశ్చిమ ఎమ్మెల్యే జి వెంకటాచలంపై కొన్ని షాకింగ్ ఆరోపణలు చేస్తూ త్రిష పేరును తెరపైకి తెచ్చారు. 
 
ఆ వ్యాఖ్యల సందర్భంగా రాజకీయ నాయకులతో పడక పంచుకునేందుకు సిద్ధపడే హీరోయిన్ల గురించి మాట్లాడుతూ త్రిషతో పాటు ఇతర హీరోయిన్ల పేర్లను కూడా ఉటంకించారు. ఈ వీడియో వైరల్ కావడం, త్రిషను ఈ కామెంట్లపై స్పందించమని అడగటంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అంతేగాకుండా త్రిషకు మద్దతు పెరిగింది. 
Trisha
Trisha
 
#WeSupportTrisha అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఏవీ రాజుపై ట్రోల్స్ మొదలయ్యాయి. పాపులారిటీ కోసం ఇలాంటి నీచమైన కామెంట్లు చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో ఏవీ రాజుపై కేసు నమోదయ్యే అవకాశం లేకపోలేదని టాక్ వస్తోంది. దీనిపై త్రిష కఠిన చర్యల తీసుకునే దిశగా సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది.