బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 5 జనవరి 2024 (18:23 IST)

రామ్ చరణ్ సినిమాలో శివరాజ్ కుమార్ కీలక పాత్ర ఫిక్స్

Ram Charan - Shivraj Kumar
Ram Charan - Shivraj Kumar
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో తన 15 వ చేస్తున్నారు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వర్తమాన రాజకీయ నేపథ్యంలో ఈ సినిమాను శంకర్ అద్భుతంగా మలుస్తున్నారు. గతంలో అపరిచితుడు, ఐ వంటి సరికొత్త కథలను ఆయన ఎంచుకున్నట్లే ఈ సినిమాలోనూ మంచి సామాజిక అంశం వుందని తెలుస్తోంది. 
 
ఇదిలా వుండగా, ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన 16 వ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో విజయ్ సేతుపతి, త్రిష కృష్ణన్, జాన్వీ కపూర్‌ నటిస్తున్నారని ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో ప్రముఖ పాత్రను కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పోషిస్తున్నాడు. దీనికి సంబంధించి ఇటీవలే ఆయన బెంగులూరులో ఓ కార్యక్రమంలో విషయాన్ని తెలిపాడు. ఉప్పెన సినిమా చాలా బాగా నచ్చింది. దర్శకుడు టేకింగ్ బాగుందని కితాబిచ్చారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి వివరాలు తెలియనున్నాయి.