1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2023 (15:56 IST)

శివరాజ్ కుమార్ సినిమాలో కామియో మిస్ అయ్యా - కథానాయకుడు నాని

Shivraj Kumar, Nani
Shivraj Kumar, Nani
కథానాయకుడు నాని ఇటీవలే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ను ఆయన ఇంటిలో కలిసి తన సినిమా హాయ్ నాన్న ప్రమోషన్ కు సహకరించమని కోరారు. ఈ సందర్భంగా వారి మధ్య సినిమా ముచ్చట్లు జరిగాయి. ఈనెల 7 న కన్నడలోనూ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు ఇలా తెలియజేశారు.
 
శివరాజ్ కుమార్ తో కలిసినప్పుడు ఎటువంటి విషయాలు ప్రస్తావన వచ్చాయి?
ముఖ్యంగా సినిమాల గురించే మాట్లాడుకున్నాం. ఆయన సినిమాల గురించి నేను నా సినిమాల గురించి ఆయన చెబుతూ వున్నారు. అయితే గతంలో ఆయన సినిమాలో ఓ కామియో రోల్ చేయమని అడిగారు. అధి అప్పట్లో సాధ్యం కాలేదు. అది చేస్తే బాగుండేదని మరలా ఆయన అన్నారు. ఈసారి తప్పకుండా చేస్తానని అన్నాను. జైలర్ లో ఆయన చేసిన రోల్ థ్రిల్ కలిగించింది. అలాంటి రోల్ నాతో చేయించాలని ఉంది. 
 
మొదట్లో మీ సినిమా ప్రమోషన్ కు తెలంగాణ ఎలక్షన్ ఇబ్బంది కలిగిస్తాయోమని అన్నారు. ఇక ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ ఏ మేరకు వుంటుందని అనుకుంటున్నారు?
నిజమే. మొదట్లో  మా సినిమా ప్రమోషన్ కు తెలంగాణ ఎలక్షన్ లో పడిపోయి జనాలు మా సినిమా గురించి మాట్లాడుకోరు అనుకున్నాం. అందుకు తగిన విధంగా పొలిటికల్ లుక్ తో రకరకాల ప్రయోగాలు చేశాం. సక్సెస్ అయింది. ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ కచ్చితంగా వుంటుంది. అయినా గతంలో చిరంజీవిగారి సినిమా జగదేకవీరుడు అతిలోక సుందరి.. సినిమా తరహాలో జోరున వర్షం, తుఫాన్ అయినా ఆ సినిమా కనక వర్షం కురిపించింది. మా సినిమా కూడా అలాగే వుంటుందని ఆవిస్తున్నాను.
 
మీ ఇంటిలో మీ అబ్బాయి మిమ్మల్ని ఏమని పిలుస్తారు?
నాన్న.. అంటారు. మొదట్లో డాడీ అనేవాడు. కానీ అచ్చమైన తెలుగును ఇంటిలో అలవాటు చేశాను. నా ఫ్యామిలీకూడా తెలుగులోనే మాట్లాడుతారు. తెలుగుదనం అంటే ఎంతో ఇష్టం. అదెలాగంటే షూటింగ్ లో మ్రణాలి ఠాగూర్ కూడా నాతో తెలుగులోనే మాట్లాడేది. నేను కొన్ని పదాలు ఆమెకు చెబుతుండేవాడిని. నాతో ఏ హీరోయిన్ నటించినా తెలుగులోనే మాట్లాడమని చెబుతుంటా. వారు అప్పటికే కొంత నేర్చుకుని వుంటారు కనుక ఈజీ అవుతుంది.
 
దసరా తర్వాత హాయ్ నాన్న సినిమా చేయడానికి కారణం?
నా దగ్గరకు అన్ని జోనర్ ల కథలు వస్తుంటాయి. చేసిందే చేయడం ఇష్టం వుండదు. అందుకే నాన్న బ్యాక్ డ్రాప్ లో కథ నచ్చి చేశాను.
 
యానిమల్ సినిమా కూడా తండ్రి నేపథ్యం కదా? మీకెలా అనిపించింది?
అందులో నెగెటివ్ షేడ్స్ వున్న తండ్రి కథ. కానీ హాయ్ నాన్న..లో మంచి ఫాదర్ కథ. నేను యానిమల్ సినిమా చూశాక సోషల్ మీడియాలో చాలా నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. కానీ నేనే ముందుగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని పెట్టాను. అని తెలిపారు.