గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (17:06 IST)

దర్శకుడు ని బట్టే సంగీతం ఆధారపడి వుంటుంది : హేషమ్ అబ్దుల్ వహాబ్

Hesham Abdul Wahab
Hesham Abdul Wahab
ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ ఒకేలా వుంటుంది. ఒకరు ప్రేమను అంగీకరించడం, మరొకరు తిరస్కరించడం, మనస్పర్థలు రావడం, విడిపోవడం, మళ్ళీ కలవడం ఇలాంటి పరిస్థుతులే వుంటాయి. అయితే ఆ కథని ఎంత యూనిక్ గా చెబుతున్నామనేది ఇక్కడ ముఖ్యం. కాదల్, రోజా, ముంబై, ఓకే బంగారం.. ఇలా ఈ చిత్రాల థీమ్స్ సిమిలర్ గా ఉండొచ్చు. అయితే దర్శకుడు ఆ కథని ఎలా చెప్పారనే దానిపైనే వైవిధ్యం ఆధారపడి వుంటుంది. సంగీతం కూడా అలానే వుంటుంది. ప్రేమ పాటల్ని విన్నప్పుడు ఒకే ఎమోషన్ వుంటుంది. హాయిగా, రొమాంటిక్ గా ఫీలౌతాం. అయితే ఆ పాట ఎవరు పాడారు, అక్కడ ఎలాంటి సాహిత్యం, సందర్భం వుందనేది కొత్త క్రియేషన్ తీసుకొస్తుంది అని హాయ్ నాన్న చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ అన్నారు.
 
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో హేషమ్ అబ్దుల్ వహాబ్ 'హాయ్ నాన్న' విశేషాలని తెలిపారు.
 
కొత్త ట్యూన్స్ ఇవ్వడం కోసం మీరు ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రతలు  తీసుకుంటారు ?
నా వరకూ దర్శకుడు విజన్ ని ఫాలో అవుతాను. ‘హాయ్ నాన్న’ విషయానికి వస్తే నేను, మా మ్యూజిక్ టీం, దర్శకుడు శౌర్యువ్ కి ఏం కావాలో అది ఇవ్వడానికి ప్రయత్నించాం. హాయ్ నాన్న వెరీ సాఫ్ట్ రొమాంటిక్ మూవీ. సంగీతం కూడా అంతే సాఫ్ట్ గా చేశాం. మీరు బాగా పరిశీలిస్తే హాయ్ నాన్న లో లైటింగ్ విజువల్స్ మ్యూజిక్ ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా మనసుకి ప్రశాంతని ఇచ్చేలా వుంటాయి.
 
ఈ మధ్య కాలంలో పాటల్లో చరణాలు వుండటం లేదు కదా.. దీనిపై మీ అభిప్రాయం ?
ఇది పూర్తిగా దర్శకుడు చేతిలో వుంటుంది. హాయ్ నాన్న సినిమా గురించి చెప్పాలంటే.. లాస్ట్ వీక్ వర్క్ పూర్తి చేసినప్పటికీ ఇంకా ఈ సినిమా హ్యంగోవర్ లోనే వున్నాను. దర్శకుడు శౌర్యవ్ పాటల్ని అద్భుతంగా ప్రజంట్ చేశారు. సినిమా చూసినప్పుడు నేనే సర్ప్రైజ్ అయ్యాను. పల్లవి ఒక చోట, చరణం మనకు సర్ ప్రైజ్ ఇచ్చేలా మరోచోట చాలా అద్భుతంగా కుదిర్చారు. సమయమా పాట శైలి చాలా భిన్నంగా వుంటుంది. గాజు బొమ్మ పాటలో రెండు చరణాలు వుంటాయి. శౌర్యవ్ రెండు ఫార్మెట్స్ ని చాలా చక్కగా చూపించారు. ఇందులో ప్రతి పాటకు ప్రాముఖ్యత వుంటుంది. మ్యూజిక్ పరంగా అందుబాటులో వున్న అడ్వాన్స్ టెక్నాలజీ ని యూజ్ చేశాం.
 
ఎంతమంది పని చేశారు ?
సినిమా కోసం 15 మంది మ్యుజిషియన్స్  దాదాపు 40 రోజులు హైదరాబాద్ లో పని చేశాం. మరో 20 మందికి పైగా ప్లేయర్స్ రికార్డింగ్స్ లో పాల్గొన్నారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండ్ గా సినిమాని నిర్మించారు. మ్యూజిక్ అంతా హైదరాబాద్ లోనే చేశాం.  
 
కొత్తగా చేస్తున్న చిత్రాలు?  
శర్వానంద్‌ గారు, శ్రీరాం ఆదిత్య సినిమాకి చేస్తున్నాను. అలాగే రష్మిక గారి గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి పని చేస్తున్నాను.