శుక్రవారం, 1 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2023 (12:17 IST)

నాని, నితిన్ కు ఈ ఏడాది ఎండింగ్ లో గడ్డు కాలమేనా?

Nitin- nani
Nitin- nani
నాచురల్ స్టార్ గా పిలుచుకునే కథానాయకుడు నాని, మరో కథానాయకుడు నితిన్ కు ఈ ఏడాది చివరిలో గడ్డుకాలంగా కనిపిస్తోంది. డిసెంబర్ 7 న నాని నటించిన హయ్ నాన్న విడుదల కాబోతుంది. 8 న నితిన్ నటించిన ఎక్స్ ట్రాడనరీ మేన్ విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాల విడుదలకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినా ప్రక్రుతి వల్ల వారికి నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు విడుదల చేయడానికి సిద్ధంగా వున్నాయి.
 
కానీ తుఫాన్ వల్ల థియటర్లకు ప్రేక్షకులు వస్తారో రారోనని ఎగిబీటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు సినిమాలు తమిళంలోనూ, తెలుగులోనూ, కేరళలో నూ విడుదల కాబోతున్నాయి. ఈ మూడు చోట్ల వర్షాలు భీబత్సంగా తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. దాంతో వారి సినిమా కలెక్షన్లకు బ్రేక్ పడినట్లుగా కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 
 
యాధ్రుచికమైనా ఇద్దరు హీరోల పేర్లలో కామన్ గా `ఎన్`  అనే అక్షరం వుందని, కనుక ఇద్దరికి ఫలితాలు ఒకేలా వుంటాయని ఇండస్ట్రీకి చెందిన ఓ విశ్లేషకుడు తెలియజేస్తున్నాడు. నానికి అంతకుముందు, అంటే సుందరానికి, హిట్ సినిమాలు ఆవించినంతగా ఆడలేకపోయాయి. ఒక్క దసరా సినిమా కూడా బాగా ఆడిందనే టాక్ వచ్చింది. అయితే కొన్ని చోట్ల ఆ సినిమా కూడా ఆశించిన కలెక్షన్లు రాబట్టలేకపోయింది.
 
ఇక నితిన్ కు మాచర్ల నియోజకవర్గం,  లై, చల్ మోహన రంగా సినిమాలు అంతగా లాభాలు తెచ్చిపెట్టలేకపోయాయింది. అందుకే ఆచితూచి తను సినిమాలు చేస్తున్నాడు. ఒక్క భీష్మ సినిమా నితిన్ కుమంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఎక్స్ ట్రాడినరీ మేన్ అంటూ ముందుకు వస్తున్నాడు. అయితే ఈాసారి పూర్తి వినోదంగా రాబోతున్నానని చెబుతున్నాడు. ప్రతి సారీ పవన్ కళ్యాణ్ అభిమానిగా ఏదో సన్నివేశమో, పాటను సింక్ చేసే నితిన్ ఈసారి బాలక్రిష్ణపై సెటైర్ గా ఓ సన్నివేశాన్ని చూపించాడు. బాలయ్యకు కోపం ఎక్కువంటగదా.. అని ట్రైలర్ లో సీనియన్ నటి అన్నపూర్ణమ్మ అగడడం దానికి నితిన్ బదులివ్వడం.. వంటివి సరదాగా వున్నా. అధి సినిమా విజయానికి ఎంత మేరకు సహకరిస్తాయో చూడాలి.
 
అందుకే ఓవర్ సీస్ ;పై నాని ఆశలు పెట్టుకున్నాడు. ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు అక్కడ పర్యటనకు సిద్దమయ్యాడు.