శనివారం, 1 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2016 (09:04 IST)

దెయ్యం సినిమాల్లో ఇక నటించను.. వైవిధ్యమైన పాత్రలు వస్తేనే నటిస్తా

ఆర్ మాధేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మోహిని. త్రిష హారర్ సినిమాలో మూడోసారిగా మోహినిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే తన దెయ్యం చివరి దె

ఆర్ మాధేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మోహిని. త్రిష హారర్ సినిమాలో మూడోసారిగా మోహినిలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే తన దెయ్యం చివరి దెయ్యం సినిమా అని త్రిష అంటోంది. ఓ ముఠా హతమార్చడంతో దెయ్యంగా మారుతున్న త్రిష వారిని హతమార్చేందుకు ప్రయత్నిస్తుంది. దేశవిదేశాల్లో ఉన్న ఆ వ్యక్తులను ఎలా హతమార్చి పగ తీర్చుకుందన్న విషయాన్ని ఆసక్తికరంగా చెప్పామని అంటున్నారు దర్శకుడు మాదేష్‌. 
 
సినిమా గురించి త్రిష మాట్లాడుతూ.. నేను మునుపటిలా లేను. కథ విని తన పాత్ర నచ్చితేనే నటిస్తున్నా. ఓ నటిగా పలురకాల నటనను వ్యక్తపరచాలన్న ఉద్దేశంతోనే ప్రస్తుతం వరుసగా దెయ్యం చిత్రాలను ఎంచుకుంటున్నా. ఆ రకంగా సంతృప్తి పొందాను. ఇకపై దెయ్యం చిత్రాలపై పెద్దగా ఆసక్తి కనబరచను. బహుశా నా చివరి దెయ్యం సినిమా 'మోహిని' కావచ్చు. వైవిధ్యమైన పాత్రలు వస్తేనే ఇకపై నటిస్తానని త్రిష చెప్పింది. ఈ సినిమా పూర్తయ్యాక త్రిష విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం.