సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (18:32 IST)

శబరిమల తీర్పు-కోర్టు ఆదేశాలు స్త్రీలకు దక్కిన గౌరవం.. త్రిష

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో శబరిమలలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు కేరళ సర్కార్ చర్యలు చేపట్టింది. పంబా నదీతీరంలో మహిళల కోసం ప్రత్యేక ఘాట్‌లను

శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో శబరిమలలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు కేరళ సర్కార్ చర్యలు చేపట్టింది. పంబా నదీతీరంలో మహిళల కోసం ప్రత్యేక ఘాట్‌లను ఏర్పాటు చేయడంతో పాటు బస్సుల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు, మహిళలకు అనుకూలంగా ఉండేలా టాయ్‌లెట్ల నిర్మాణం వంటి ఏర్పాట్లుపై ప్రభుత్వం దృష్టి సారించింది. 
 
శబరిమలపై మహిళల ప్రవేశానికి సుప్రీం తీర్పును మేథావులు, అభ్యుదయవాదులు స్వాగతించగా, సంప్రదాయాలు, ఆచారాలకు ఈ తీర్పు విరుద్ధమని హిందూ వర్గాలు మండిపడుతున్నాయి. మహిళా యాత్రికులు శబరిమల సందర్శించేలా తాము అవసరమైన అన్ని చర్యలూ చేపడతామని కేరళ మంత్రి సురేంద్రన్‌ తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై సినీ నటి త్రిష స్పందించింది. గతంలో సుప్రీంకోర్టు సహజీవనం తప్పుకాదని చెబుతూ, గే సెక్స్ పై కీలక తీర్పిచ్చిన వేళ కూడా, త్రిష ఆ తీర్పును స్వాగతించి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. తాజాగా శబరిమల తీర్పుపై త్రిష మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాలు స్త్రీలకు దక్కిన గౌరవమని చెప్పింది. ఈ వ్యవహారాల గురించి తనకు పూర్తిగా తెలియదుగానీ, దేవాలయాలకు వెళ్లే ఎవరినీ అడ్డుకోరాదని తెలిపింది.