శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (21:52 IST)

హీరో చెర్రీ సతీమణి ఉపాసన డెలివరీ ఎక్కడో తెలుసా? (video)

upasana
హీరో రామ్ చరణ్ - ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఉపాసన ప్రస్తుతం గర్భందాల్చివున్న విషయం తెల్సిందే. ఆమె త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. అయితే, ఆమె అమెరికాలో డెలివరీ చేసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ జెన్నిఫర్ ఆస్టన్ హీరో చెర్రీతో ముచ్చటించారు. ఇందులో ఆమె మాట్లాడుతూ, మీ ఫస్ట్ బేబీకి డెలివరీ చేయడాన్ని గౌవరంగా భావిస్తాను అని చెప్పారు. 
 
దీనికి ఉపాసన తనదైనసైలిలో స్పందించారు. డాక్టర్ జెన్నిపర్ మీ మాటలు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని అన్నారు. మిమ్మల్ని చూడటానికి ఎదురు చూస్తున్నానని, తమ బేబీకి డెలివరీ చేసేందుకు అపోల్ ఆస్పత్రిలో డాక్టర్ సుమన, డాక్టర్ రూమ సిన్హాలతో కలవాలని కోరారు. దీనికి సమాధానంగా తనకు కూడా రావాలనే ఉందని, డాక్టర్ జెన్నిఫర్ అన్నారు.